ఫోన్ ట్యాపింగ్‌పై ప్రభుత్వాలకు నోటీసులు
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో పలువురు ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారంటూ దాఖలైన పిటిషన్ ను మంగళవారం హైకోర్టు విచారించింది. ఈ పిటిషన్ కు సంబంధించి ఆధారాలు ఉంటే అఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషనర్ ను ఈ సందర్భంగా ధర్మాసనం ఆదేశించింది. అదేవిధంగా ఈ పిటిషన్ ను ఎందుకు విచారించొద్దో చెప్పాలని ప్రభుత్వం తరఫు లాయర్ ను ప్రశ్నించింది. ఈ అంశంపై ఎల్లుండిలోగా కౌంటర్ దాఖలు చేయాలని సర్వీస్ ప్రొవైడర్లు, కేంద్ర, ఏపీ ప్రభుత్వాలకు నోటీసులు […]
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో పలువురు ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారంటూ దాఖలైన పిటిషన్ ను మంగళవారం హైకోర్టు విచారించింది. ఈ పిటిషన్ కు సంబంధించి ఆధారాలు ఉంటే అఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషనర్ ను ఈ సందర్భంగా ధర్మాసనం ఆదేశించింది. అదేవిధంగా ఈ పిటిషన్ ను ఎందుకు విచారించొద్దో చెప్పాలని ప్రభుత్వం తరఫు లాయర్ ను ప్రశ్నించింది. ఈ అంశంపై ఎల్లుండిలోగా కౌంటర్ దాఖలు చేయాలని సర్వీస్ ప్రొవైడర్లు, కేంద్ర, ఏపీ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది.