HDFC ఖాతాదారులకు గమనిక.. సేవలు బంద్
దిశ, వెబ్‌డెస్క్ : హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తమ కస్టమర్లకు హెచ్చరికలు జారీ చేసింది. ఈరోజు రేపు ఆన్‌లైన్ సేవలకు అంతరాయం కలుగుతుందని తెలిపింది. మెయింటెనెన్స్ కారణంగా సేవలకు అంతరాయం కలుగుతోందని, అందువలన రెండు రోజుల బ్యాంక్ ఆన్‌లైన్ సేవలు అందుబాటులో ఉండవని పేర్కొంది. ఆగస్ట్ 7న సాయంత్రం 6 గంటల నుంచి ఆగస్ట్ 8న రాత్రి 10 గంటల వరకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా క్రెడిట్ కార్డు స్టేట్‌మెంట్ డౌన్‌లోడ్ చేసుకోవడం […]
దిశ, వెబ్‌డెస్క్ : హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తమ కస్టమర్లకు హెచ్చరికలు జారీ చేసింది. ఈరోజు రేపు ఆన్‌లైన్ సేవలకు అంతరాయం కలుగుతుందని తెలిపింది. మెయింటెనెన్స్ కారణంగా సేవలకు అంతరాయం కలుగుతోందని, అందువలన రెండు రోజుల బ్యాంక్ ఆన్‌లైన్ సేవలు అందుబాటులో ఉండవని పేర్కొంది. ఆగస్ట్ 7న సాయంత్రం 6 గంటల నుంచి ఆగస్ట్ 8న రాత్రి 10 గంటల వరకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా క్రెడిట్ కార్డు స్టేట్‌మెంట్ డౌన్‌లోడ్ చేసుకోవడం లేదా వాటిని చూసుకోవడానికి అవకాశం ఉండదు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆగస్ట్ 11న ఉదయం 6.30 గంటల వరకు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు సంబంధిత సర్వీసులు పొందడానికి వీలుండదు.