ఎక్కడ ఆడాలో ఇంకా నిర్ణయించలేదు : పీసీబీ చైర్మన్
ఆసియా కప్ క్రికెట్ టోర్నీ ఎక్కడ నిర్వహించాలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ ఎహ్సాన్ మణి తెలిపారు. కాగా ఆసియా కప్ దుబాయ్‌లో జరుగుతుందని..ఇందులో భారత్, పాక్ జట్లు కూడా పాల్గొంటాయని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ శుక్రవారం చేసిన వ్యాఖ్యల పట్ల ఎహ్సాన్ పైవిధంగా స్పందించారు. అంతేకాదు, ఆసియా కప్‌కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వకుంటే దుబాయ్ ఒక్కటే ప్రత్యామ్నాయ వేదిక కాదన్నారు. అయితే షెడ్యూల్ ప్రకారం.. ఆసియా కప్ ఈసారి పాకిస్తాన్‌లో […]
ఆసియా కప్ క్రికెట్ టోర్నీ ఎక్కడ నిర్వహించాలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ ఎహ్సాన్ మణి తెలిపారు. కాగా ఆసియా కప్ దుబాయ్‌లో జరుగుతుందని..ఇందులో భారత్, పాక్ జట్లు కూడా పాల్గొంటాయని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ శుక్రవారం చేసిన వ్యాఖ్యల పట్ల ఎహ్సాన్ పైవిధంగా స్పందించారు. అంతేకాదు, ఆసియా కప్‌కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వకుంటే దుబాయ్ ఒక్కటే ప్రత్యామ్నాయ వేదిక కాదన్నారు.
అయితే షెడ్యూల్ ప్రకారం.. ఆసియా కప్ ఈసారి పాకిస్తాన్‌లో జరగాల్సి ఉంది. కానీ భద్రతా కారణాల రీత్యా భారత జట్టును పాకిస్తాన్‌కు పంపలేమని బీసీసీఐ స్పష్టం చేసింది. టీమ్ ఇండియా ఆడకపోతే స్పాన్సరర్లు ముందుకు రాకపోవడంతో పాటు ఆటను వీక్షించే అభిమానుల సంఖ్య కూడా తగ్గే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆసియా కప్ దుబాయ్‌లో జరుగుతుందని గంగూలీ వ్యాఖ్యానించారు. కానీ ఆసియాలోని అన్ని క్రికెట్ దేశాలతో సంప్రదించిన తర్వాతే ఎక్కడ నిర్వహించాలో నిర్ణయిస్తామని పీసీబీ చైర్మన్ ఎహ్సాన్ మణి స్పష్టం చేశారు. కాగా, బీసీసీఐ మాటను కాదని ఇతర దేశాలు కూడా వేరే చోటును సూచించే అవకాశం లేదు.