శ్రామిక్ రైళ్లు వెళ్లే రాష్ట్రాల సమ్మతి అక్కర్లేదు : రైల్వేస్
న్యూఢిల్లీ: వలస కూలీలను తరలించే శ్రామిక్ ట్రైన్‌లకు గమ్యస్థాన రాష్ట్రాల సమ్మతి అవసరం లేదని ఇండియన్ రైల్వేస్ వెల్లడించింది. లాక్‌డౌన్ నేపథ్యంలో ట్రైన్‌ల రాకపోకలపై పలు రాష్ట్రాలు అభ్యంతరం చెబుతున్నాయని కేంద్రం పేర్కొన్న తర్వాత ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం. ఇప్పటివరకూ వలస కూలీలను తరలించేందుకు ఇరు రాష్ట్రాల అంగీకారాన్ని రైల్వే తీసుకున్నది. రెండు రాష్ట్రాల్లోనూ రెండే స్టాప్‌లతో ఈ ట్రైన్‌లు నడిచేవి. కానీ, తాజాగా, శ్రామిక్ ట్రైన్‌లకోసం అభ్యర్థించిన రాష్ట్రాలు తప్పితే, గమ్యస్థాన రాష్ట్రాల అంగీకారం […]
న్యూఢిల్లీ: వలస కూలీలను తరలించే శ్రామిక్ ట్రైన్‌లకు గమ్యస్థాన రాష్ట్రాల సమ్మతి అవసరం లేదని ఇండియన్ రైల్వేస్ వెల్లడించింది. లాక్‌డౌన్ నేపథ్యంలో ట్రైన్‌ల రాకపోకలపై పలు రాష్ట్రాలు అభ్యంతరం చెబుతున్నాయని కేంద్రం పేర్కొన్న తర్వాత ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం. ఇప్పటివరకూ వలస కూలీలను తరలించేందుకు ఇరు రాష్ట్రాల అంగీకారాన్ని రైల్వే తీసుకున్నది. రెండు రాష్ట్రాల్లోనూ రెండే స్టాప్‌లతో ఈ ట్రైన్‌లు నడిచేవి. కానీ, తాజాగా, శ్రామిక్ ట్రైన్‌లకోసం అభ్యర్థించిన రాష్ట్రాలు తప్పితే, గమ్యస్థాన రాష్ట్రాల అంగీకారం లేకున్నా వలస కూలీలను ఆ రాష్ట్రల్లోకి తరలించవచ్చని తెలిపింది. ఈ మేరకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్ నిబంధనలనూ మార్చాల్సి ఉన్నది. వలస కూలీల తరలింపు అంశంపై కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కేంద్ర ప్రభుత్వం.. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ సీఎంల మధ్య గట్టి వాదనలు జరిగాయి. కాగా, రాష్ట్రాలు మరిన్ని శ్రామిక్ ట్రైన్‌లను అనుమతించాలని, స్టాప్‌లనూ పెంచాలని కేంద్రం సూచించింది. ఈ వాదనను తిప్పికొడుతూ రాష్ట్ర ప్రభుత్వాలు.. తాము అనుమతిస్తున్నామని, కానీ, కేంద్రమే రాజకీయాలు చేస్తున్నదని విమర్శించాయి.