‘హెచ్-1బీ’పై ట్రంప్ ఆంక్షలకు కత్తెరేసిన కోర్టు

వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం హెచ్-1బీ వీసాపై తీసుకువచ్చిన రెండు ఆంక్షలకు ఉత్తర కాలిఫోర్నియా జిల్లా న్యాయస్థానం కత్తెరేసింది. తాత్కాలిక ఉద్యోగ విధుల కోసం ఇతర దేశాస్తులను అమెరికాకు రప్పించుకోవడానికి వినియోగించే హెచ్-1బీ వీసాలను కఠినతరం చేస్తూ ట్రంప్ సర్కారు తీసుకువచ్చిన రెండు నిబంధనలను యూఎస్ జిల్లా న్యాయమూర్తి జెఫ్రీ ఎస్ వైట్ తోసిపుచ్చారు. ఈ నిబంధనలు కరోనా కాలంలో ‘మంచి పరిణామం’ పేరిట వేగంగా తీసుకువచ్చారని, పారదర్శక పరిశీలన జరగలేదని వివరించారు. ఈ నిబంధనలపై అభిప్రాయాలను […]

Update: 2020-12-02 11:20 GMT

వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం హెచ్-1బీ వీసాపై తీసుకువచ్చిన రెండు ఆంక్షలకు ఉత్తర కాలిఫోర్నియా జిల్లా న్యాయస్థానం కత్తెరేసింది. తాత్కాలిక ఉద్యోగ విధుల కోసం ఇతర దేశాస్తులను అమెరికాకు రప్పించుకోవడానికి వినియోగించే హెచ్-1బీ వీసాలను కఠినతరం చేస్తూ ట్రంప్ సర్కారు తీసుకువచ్చిన రెండు నిబంధనలను యూఎస్ జిల్లా న్యాయమూర్తి జెఫ్రీ ఎస్ వైట్ తోసిపుచ్చారు. ఈ నిబంధనలు కరోనా కాలంలో ‘మంచి పరిణామం’ పేరిట వేగంగా తీసుకువచ్చారని, పారదర్శక పరిశీలన జరగలేదని వివరించారు. ఈ నిబంధనలపై అభిప్రాయాలను స్వీకరించాలని సూచించారు. కొత్త నిబంధనలు హెచ్-1బీ వీసాదారుల వేతనాలను తగ్గించడంతోపాటు, వీసా వ్యాలిడిటీ మూడేళ్లకు బదులు ఏడాదికే కుదించేలా ట్రంప్ ప్రభుత్వం సవరణలు చేసింది.

Tags:    

Similar News