కరెంట్ బిల్ చూసి హర్భజన్ షాక్
దిశ, స్పోర్ట్స్: లాక్‌డౌన్ సమయంలో కరెంట్ మీటర్ రీడింగ్ తీసే సిబ్బంది ఇళ్లకు రాలేదు. ఆ తర్వాత ఒకేసారి రెండు నెలల బిల్ పంపడంతో పలువురు వినియోగదారులు ఆశ్చర్యపోయారు. ఇప్పుడు అలాంటి అనుభవమే టీమ్‌ఇండియా వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్‌కు ఎదురైంది. ముంబయిలో నివసించే హర్భజన్ ఇంటికి అదానీ ఎలక్ట్రిసిటీ కరెంటు కనెక్షన్ ఉంది. ఈ నెల రూ. 33,900 బిల్లు వచ్చింది. ఆ బిల్లు చూసి భజ్జీ కంగుతిన్నాడు. ‘నేను ప్రతి నెల చెల్లించే దాని […]
దిశ, స్పోర్ట్స్: లాక్‌డౌన్ సమయంలో కరెంట్ మీటర్ రీడింగ్ తీసే సిబ్బంది ఇళ్లకు రాలేదు. ఆ తర్వాత ఒకేసారి రెండు నెలల బిల్ పంపడంతో పలువురు వినియోగదారులు ఆశ్చర్యపోయారు. ఇప్పుడు అలాంటి అనుభవమే టీమ్‌ఇండియా వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్‌కు ఎదురైంది. ముంబయిలో నివసించే హర్భజన్ ఇంటికి అదానీ ఎలక్ట్రిసిటీ కరెంటు కనెక్షన్ ఉంది. ఈ నెల రూ. 33,900 బిల్లు వచ్చింది. ఆ బిల్లు చూసి భజ్జీ కంగుతిన్నాడు. ‘నేను ప్రతి నెల చెల్లించే దాని కంటే ఏడింతలు ఎక్కువ బిల్లు వచ్చింది. ఇది నా బిల్లేనా? లేదా చుట్టు పక్కల వాళ్లందరి బిల్లు నాకే వేశారా?’ అంటూ భజ్జీ ట్వీట్ చేశాడు. తనకు వచ్చిన బిల్లు మెసేజ్‌ను కూడా జత చేశాడు. ఐపీఎల్ 2020 ప్రారంభం కానుండటంతో త్వరలో హర్భజన్ యూఏఈకి పయనం కానున్నాడు. అతడు చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.