నోటీసులు ఇచ్చినా ఆగని అక్రమ నిర్మాణాలు
దిశ, అల్వాల్ : అల్వాల్ సర్కిల్ పరిధిలో నిరాటకంగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. జీహెచ్ఎంసీ అధికారులు సదరు నిర్మాణదారులకు నోటీసులు ఇచ్చినా ఖాతరు చేయడం లేదు. పేదలు 50 గజాలలో ఇంటి నిర్మాణం చేపడితే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఇళ్లను కూల్చే టౌన్‌ప్లానింగ్ అధికారులు వ్యాపార సముదాయాల నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నా ఎందుకు కూల్చడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. రెడ్డిఎన్క్లేవ్ ప్రధాన రహదారిలో కడుతున్న కమర్షియల్ కాంప్లెక్స్‌కు రెండు నోటీసులు ఇచ్చినా నిర్మాణాన్ని ఆపడం లేదని స్థానికుల […]
దిశ, అల్వాల్ : అల్వాల్ సర్కిల్ పరిధిలో నిరాటకంగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. జీహెచ్ఎంసీ అధికారులు సదరు నిర్మాణదారులకు నోటీసులు ఇచ్చినా ఖాతరు చేయడం లేదు. పేదలు 50 గజాలలో ఇంటి నిర్మాణం చేపడితే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఇళ్లను కూల్చే టౌన్‌ప్లానింగ్ అధికారులు వ్యాపార సముదాయాల నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నా ఎందుకు కూల్చడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. రెడ్డిఎన్క్లేవ్ ప్రధాన రహదారిలో కడుతున్న కమర్షియల్ కాంప్లెక్స్‌కు రెండు నోటీసులు ఇచ్చినా నిర్మాణాన్ని ఆపడం లేదని స్థానికుల ఆరోపిస్తున్నారు.
ఇంటి నిర్మాణాలకన్న వ్యాపార సముదాయాల నిర్మాణాల పైనే నాల ఆక్రమణలు ఎక్కువ జరిగాయని స్థానికులు పేర్కొంటున్నారు. అల్వాల్ సర్కిల్ పరిధిలోని నాలాలు పరిశీలిస్తే ఆక్రమణలు ఎంతలా జరుగుతున్నాయో తెలుస్తుందన్నారు. ఇటీవల నాలాల పై వేసిన సబ్‌కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే అన్నివిషయాలు బయటకు వస్తాయని స్థానికులంటున్నారు. అధికారులు నోటీసులతోనే సరిపెడుతున్నారని, కానీ చర్యలు తీసుకునేందుకు వెనకాడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.