రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకోండి..

మైనారిటీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజు యువ వికాసం పథకం కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

Update: 2025-03-27 16:59 GMT

దిశ, మేడ్చల్ బ్యూరో : మైనారిటీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజు యువ వికాసం పథకం కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ముస్లిం, క్రిస్టియన్, సిక్, బౌద్ధ, జైన్, పార్సి వర్గాలకు చెందిన మైనార్టీలు గ్రామీణ ప్రాంతంలో సంవత్సర ఆదాయం లక్ష 50 వేలు, పట్టణ ప్రాంతాలలో సంవత్సరానికి రెండు లక్షలకు మించకుండా , 21 సంవత్సరాల వయసు నుంచి 60 సంవత్సరాల వయసు వరకు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

దరఖాస్తు సమయంలో ఆధార్ కార్డు, రేషన్ కార్డ్, రేషన్ కార్డు లేని వారు ఆదాయ ధ్రువీకరణ పత్రం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జారీ చేయబడిన కుల దృవీకరణ పత్రం, డ్రైవింగ్ లైసెన్స్, వ్యవసాయ పథకాల కోసం పట్టాదారు పాస్బుక్, దివ్యాంగులు అయితే సదరం సర్టిఫికెట్, పాస్పోర్ట్ ఫోటో, వాలంటరీ గ్రూప్ సర్టిఫికెట్ లను అందించాల్సి ఉంటుందని, http://tgobmmsnew.cgg.gov.in వెబ్సైట్ ద్వారా ఏప్రిల్ 5వ తారీఖు లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అంతర్జాలంలో చేసుకున్న దరఖాస్తు పత్రాన్ని డౌన్లోడ్ చేసుకొని అవసరమైన పత్రాలను జత చేసి వాటిని గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఎంపీడీవో కార్యాలయంలో, పట్టణ ప్రాంతాలు అయితే మున్సిపల్, జోనల్ కమిషనర్ కార్యాలయాల్లో అందజేయాలని సూచించారు.

Similar News