దేశీయ మార్కెట్లోకి నోకియా ఏసీలు

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ టెలీకమ్యూనికేషన్ నోకియాతో కలిసి సంయుక్తంగా భారత్‌లో ‘మేడ్ ఇన్ ఇండియా’ ఏసీలను తీసుకురాబోతున్నట్టు ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. నోకియా బ్రాండ్‌గా వచ్చే వీటిని ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే అందుబాటులో ఉండనున్నట్టు పేర్కొంది. దశాబ్దం క్రితం మొబైల్‌ఫోన్ మార్కెట్‌ను ఏలిన నోకియా ఆ తర్వాత కొత్త ఉత్పత్తులను తీసుకురావడంలో విఫలమైంది. గతేడాది తిరిగి మార్కెట్లోకి నూతన ఆవిష్కరణలతో నోకియా టీవీలను తీసుకొచ్చింది. ఇటీవల నోకియా ల్యాప్‌టాప్‌లను ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఏసీలను కొత్త […]

Update: 2020-12-21 09:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ టెలీకమ్యూనికేషన్ నోకియాతో కలిసి సంయుక్తంగా భారత్‌లో ‘మేడ్ ఇన్ ఇండియా’ ఏసీలను తీసుకురాబోతున్నట్టు ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. నోకియా బ్రాండ్‌గా వచ్చే వీటిని ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే అందుబాటులో ఉండనున్నట్టు పేర్కొంది. దశాబ్దం క్రితం మొబైల్‌ఫోన్ మార్కెట్‌ను ఏలిన నోకియా ఆ తర్వాత కొత్త ఉత్పత్తులను తీసుకురావడంలో విఫలమైంది. గతేడాది తిరిగి మార్కెట్లోకి నూతన ఆవిష్కరణలతో నోకియా టీవీలను తీసుకొచ్చింది. ఇటీవల నోకియా ల్యాప్‌టాప్‌లను ప్రవేశపెట్టింది.

ఇప్పుడు ఏసీలను కొత్త సాంకేతికతతో మార్కెట్లోకి తీసుకొస్తున్నట్టు నోకియా సంస్థ ప్రతినిధి తెలిపారు. నోకియా తీసుకొచ్చే ఏసీలు స్వచ్ఛమైన గాలిని అందించేందుకు 6-ఇన్ ఫిల్టర్లను, యాంటి మైక్రోబయల్ అయనైజర్ ఇన్‌బిల్ట్‌గా వస్తాయని, అడ్జస్టబుల్ ఇన్వర్టర్ మోడ్, ఆర్32 రిఫ్రిజిరేట్, ఎన్విరాన్‌మెంట్ ఫ్రెండ్లీ ఇంకా ఇతర ఫీచర్లతో వినియోగదారుల కోసం తీసుకొస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది. వీటిని స్మార్ట్‌ఫోన్‌లతో కూడా ఆపరేట్ చేసే వీలుంటుందని నోకియా వెల్లడించింది. వీటి ధర 30,999 వద్ద నుంచి విక్రయించనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.

Tags:    

Similar News