సీజ్ చేసిన వాహనాల కోసం సిపారసు చేస్తే వదిలిపెట్టం

దిశ, వెబ్‌డెస్క్ : లాక్‌డౌన్ సమయంలో అకారణంగా బయటకు వచ్చిన వారిపై కేసులు నమోదు చేయడంతోపాటు వాహనాలను సీజ్ చేస్తామని వలిగొండ ఎస్ఐ రాఘవేందర్ గౌడ్ హెచ్చరించారు. ప్రస్తుతం మండలంలో పకడ్భందీగా లాక్ డౌన్ అమలు అవుతుందని చెప్పారు. సీజ్ చేసిన వాహనాలు వదిలిపెట్టమని ఎవరైనా సిఫార్సు చేయడానికి వస్తే వారిని సైతం ఉపేక్షించేది లేదని, వారి పట్ల కూడా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. కాగా, యాదాద్రి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. […]

Update: 2021-05-25 08:48 GMT

దిశ, వెబ్‌డెస్క్ : లాక్‌డౌన్ సమయంలో అకారణంగా బయటకు వచ్చిన వారిపై కేసులు నమోదు చేయడంతోపాటు వాహనాలను సీజ్ చేస్తామని వలిగొండ ఎస్ఐ రాఘవేందర్ గౌడ్ హెచ్చరించారు. ప్రస్తుతం మండలంలో పకడ్భందీగా లాక్ డౌన్ అమలు అవుతుందని చెప్పారు. సీజ్ చేసిన వాహనాలు వదిలిపెట్టమని ఎవరైనా సిఫార్సు చేయడానికి వస్తే వారిని సైతం ఉపేక్షించేది లేదని, వారి పట్ల కూడా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

కాగా, యాదాద్రి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఎస్ఐ రాఘవేందర్ గౌడ్ తన సిబ్బందితో కలిసి పెట్రోలింగ్, తనిఖీలు చేస్తూ కఠినంగా వ్యవహరిస్తున్నారు. టైంపాస్‌కు వీధుల్లోకి వచ్చే వారిపై చర్యలు తీసుకోవడంతోపాటు, వారి వాహనాలను సీజ్ చేస్తున్నారు. లాక్‌డౌన్‌ ఎస్ఐ రాఘవేందర్ గౌడ్ సీరియస్ గా తీసుకోవడంతో మండలంలోని రోడ్లన్నీ బోసిపోయి కనిపించాయి

Tags:    

Similar News