మళ్లీ లాక్‌డౌన్ విధించే ప్లాన్స్ లేవు: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి లాక్‌డౌన్ విధించే అవకాశమున్నదని వస్తున్న వాదనలను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఖండించారు. ఢిల్లీలో మళ్లీ లాక్‌డౌన్ విధించే ప్రణాళికలు ఏవీ లేవని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి అమిత్ షా నిర్వహించిన అఖిలపక్ష సమావేశం ముగిసిన తర్వాత కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ సీఎం విజయ్ రూపానీ కూడా ఇదే విధంగా మాట్లాడారు. రాష్ట్రంలో మళ్లీ లాక్‌డౌన్ విధించే ప్రణాళికలేవీ లేవని తెలిపారు. […]
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి లాక్‌డౌన్ విధించే అవకాశమున్నదని వస్తున్న వాదనలను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఖండించారు. ఢిల్లీలో మళ్లీ లాక్‌డౌన్ విధించే ప్రణాళికలు ఏవీ లేవని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి అమిత్ షా నిర్వహించిన అఖిలపక్ష సమావేశం ముగిసిన తర్వాత కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
గుజరాత్ సీఎం విజయ్ రూపానీ కూడా ఇదే విధంగా మాట్లాడారు. రాష్ట్రంలో మళ్లీ లాక్‌డౌన్ విధించే ప్రణాళికలేవీ లేవని తెలిపారు. సోషల్ మీడియాలో వదంతులను నమ్మొద్దని తెలిపారు. జూన్ 1వ తేదీ నుంచి అన్‌లాక్ మొదలైన తర్వాత ప్రజా జీవనం మళ్లీ సాధారణ స్థితిని సంతరించుకుంటున్నదని, ఆర్థిక కార్యకలాపాలు మళ్లీ పుంజుకుంటున్నాయని, ఇటువంటి సమయంలో లాక్‌డౌన్ విధించాలనుకోవట్లేదని స్పష్టం చేశారు.