ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది ఇలా.. కరోనా పరీక్షలు ఎలా..?
దిశ,పాలేరు: ఖమ్మం జిల్లా ముదిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా విధులకు రావడంతో రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 9:30 గంటలకు విధులకు హాజరు కావలసిన వైద్యులు 10:40 కి విధులకు హాజరైన వైనం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. ఒక పక్క గత రెండు రోజులుగా ఈ ప్రాంత ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న కరోనా మహమ్మారి నేపథ్యంలో కరోనా పరీక్షల కోసం రోగులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. పరీక్షలు నిర్వహించాల్సిన […]
దిశ,పాలేరు: ఖమ్మం జిల్లా ముదిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా విధులకు రావడంతో రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 9:30 గంటలకు విధులకు హాజరు కావలసిన వైద్యులు 10:40 కి విధులకు హాజరైన వైనం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. ఒక పక్క గత రెండు రోజులుగా ఈ ప్రాంత ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న కరోనా మహమ్మారి నేపథ్యంలో కరోనా పరీక్షల కోసం రోగులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. పరీక్షలు నిర్వహించాల్సిన ల్యాబ్ టెక్నీషియన్ విధులకు ఆలస్యంగా హాజరు కావడంతో కరోనా పరీక్షల కోసం ఆసుపత్రిలో ఉదయం నుంచి ఎదురు చూశామని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంతో కూడా సిబ్బంది విధులకు సక్రమంగా రాని కారణంగా ఆసుపత్రి గేటుకు తాళం వేశారు. ఇక్కడి సిబ్బందికి ఉన్నతాధికారులు తాఖీదులు కూడా ఇచ్చినా,మళ్ళీ తీరు మారలేదని రోగులు ఆరోపిస్తున్నారు.