చావు ‘గోస’.. ఆఖరి మజిలీ ఇకనైనా సాఫీగా సాగేనా..?
దిశ, నర్సంపేట టౌన్ : నర్సంపేట పట్టణంలోని మాదన్నపేట రోడ్డులో గల స్మశానవాటికలో పారిశుధ్యం పనులు జరగక శవాల వెంట తీసుకువచ్చిన సామగ్రి ఎక్కడపడితే అక్కడే దర్శనమిస్తోంది. గత కొన్ని రోజుల నుండి వర్షాలు పడుతుండటం వలన అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వచ్చే ప్రజలకు స్మశానవాటిక లోపల నడవటం, స్నానాలు చేసేందుకు సరిపడా వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మధ్యకాలంలో దహన కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ధర్మారావుపేట గ్రామానికి చెందిన ఇల్లందుల జయ అనే మహిళ […]
దిశ, నర్సంపేట టౌన్ : నర్సంపేట పట్టణంలోని మాదన్నపేట రోడ్డులో గల స్మశానవాటికలో పారిశుధ్యం పనులు జరగక శవాల వెంట తీసుకువచ్చిన సామగ్రి ఎక్కడపడితే అక్కడే దర్శనమిస్తోంది. గత కొన్ని రోజుల నుండి వర్షాలు పడుతుండటం వలన అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వచ్చే ప్రజలకు స్మశానవాటిక లోపల నడవటం, స్నానాలు చేసేందుకు సరిపడా వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మధ్యకాలంలో దహన కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ధర్మారావుపేట గ్రామానికి చెందిన ఇల్లందుల జయ అనే మహిళ కాలుజారి పడటం వల్ల తలకు బలమైన గాయమైంది. ఆమె స్పృహ కోల్పోవడంతో ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వైకుంఠధామాల నిర్మాణం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతుంటే మాదన్నపేట రోడ్డులోని శ్మశాన వాటికలో ఆ ఊసే లేదు. శ్మశాన వాటికలో దహన కార్యక్రమాలు జరిగిన తరువాత స్నానాలు చేయడానికి గదులు ఉన్నా ఉపయోగించుకోవడానికి అనువుగా లేకపోవడం వల్ల ఎవరు వాడటం లేదు. దీనివల్ల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. నర్సంపేట పట్టణంలో దాదాపు 60 శాతం మంది జనం ఈ స్మశాన వాటికకు రావడం జరుగుతోంది. కనీస సౌకర్యాలు లేకపోవడం వల్ల అంత్యక్రియలు నిర్వహించేందుకు వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపాలిటీ అధికారుల తీరు పట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
కానరాని ఆఖరి మజిలీ :
గత రెండు నెలల కిందట రూ.42 లక్షలతో శ్మశాన వాటిక అభివృద్ధికి టెండర్లు పూర్తి చేశారు.
టెండర్ వివరాలు :
ఆఖరి మజిలీకి రూ.16 లక్షలు
గ్రీనరీ కోసం రూ.16 లక్షలు
కాంపౌండ్ వాల్ కోసం రూ.10 లక్షలు