ప్రభుత్వాఫీసులోకి ప్రవేశం లేదు

దిశ, జహీరాబాద్: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో గల రెవెన్యూ కార్యాలయంలోకి ప్రజల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించాలని తహశీల్దార్ పోతురాజు నాగేశ్వరరావు తెలిపారు. కరోనా నేపథ్యంలో ప్రజల సందర్శనతో సిబ్బందికి కరోనా వ్యాపించే అవకాశాలున్న కారణంగా ప్రజలను తహశీల్దార్ కార్యాలయం ఆవరణలోకి అనుమతించడం లేదని ఆయన చెప్పారు. కరోనా వ్యాధి వ్యాప్తి నివారణలో భాగంగా ముందస్తు చర్యగా కార్యాలయం మెయిన్ గేట్ ను పూర్తిగా మూసివేసిన విషయం వాస్తవమేనని తహశీల్దార్ పేర్కొన్నారు. రెవెన్యూ రికార్డుల వ్యక్తిగత అంశాలపై […]

Update: 2020-07-11 02:45 GMT

దిశ, జహీరాబాద్: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో గల రెవెన్యూ కార్యాలయంలోకి ప్రజల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించాలని తహశీల్దార్ పోతురాజు నాగేశ్వరరావు తెలిపారు. కరోనా నేపథ్యంలో ప్రజల సందర్శనతో సిబ్బందికి కరోనా వ్యాపించే అవకాశాలున్న కారణంగా ప్రజలను తహశీల్దార్ కార్యాలయం ఆవరణలోకి అనుమతించడం లేదని ఆయన చెప్పారు. కరోనా వ్యాధి వ్యాప్తి నివారణలో భాగంగా ముందస్తు చర్యగా కార్యాలయం మెయిన్ గేట్ ను పూర్తిగా మూసివేసిన విషయం వాస్తవమేనని తహశీల్దార్ పేర్కొన్నారు. రెవెన్యూ రికార్డుల వ్యక్తిగత అంశాలపై నేరుగా కలవాలనుకునే ప్రజలు కరోనా మహమ్మారి పూర్తిగా కట్టడి అయిన తరువాతనే కార్యాలయం లోపల తహశీల్దార్ ను కలవడానికి అనుమతి పొందాలని ఆయన స్పష్టం చేశారు.

Tags:    

Similar News