సెక్రటేరియట్ సందర్శనకు నో

తెలంగాణ సచివాలయంలోకి సందర్శకులను అనుమతించటం లేదు. ఈ మేరకు బూర్గుల రామకృష్ణారావు భవన్ గేటు ముందు నోటీసులు అంటించారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం (డీవోపీటీ) అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో గత రెండు రోజుల నుంచి ఈ నిబంధన అమలు చేస్తున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలు తీసుకుంటోంది. త్వరలో అన్ని కార్యాలయాల్లోనూ ఈ నిబంధన అమలు చేయనుంది […]

Update: 2020-03-19 00:36 GMT

తెలంగాణ సచివాలయంలోకి సందర్శకులను అనుమతించటం లేదు. ఈ మేరకు బూర్గుల రామకృష్ణారావు భవన్ గేటు ముందు నోటీసులు అంటించారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం (డీవోపీటీ) అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో గత రెండు రోజుల నుంచి ఈ నిబంధన అమలు చేస్తున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలు తీసుకుంటోంది. త్వరలో అన్ని కార్యాలయాల్లోనూ ఈ నిబంధన అమలు చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం.

Tags: ts Secretariat, no entry, carona, ts news

Tags:    

Similar News