మందుబాబులకు ‘కరోనా రిలీఫ్’
ప్రపంచ వ్యాప్తంగా జనాలను గడగడలాడిస్తోన్న ‘కరోనా వైరస్’ మందు తాగి డ్రైవింగ్ చేస్తున్నవారికి మాత్రం బిగ్ రిలీఫ్ ఇస్తోంది. చైనాలోని వూహాన్‌లో పుట్టుకొచ్చిన ఈ మహమ్మారి ఇప్పటికే 900 మందికిపైగా ప్రాణాలను హరించి 26 దేశాలకు వ్యాపించి చుక్కలు చూపిస్తుంటే మనదేశంలో కొన్ని పట్టణాల్లో మాత్రం మందుబాబులకు బూస్ట్ ఇస్తోంది. నోట్లో నుంచి ‘క’ అనే అక్షరం వింటేనే కరోనా వైరస్‌ను తలచుకొని భయపడుతుంటే మందేసి డ్రైవింగ్ చేసేవారు మాత్రం తెగ […]
ప్రపంచ వ్యాప్తంగా జనాలను గడగడలాడిస్తోన్న ‘కరోనా వైరస్’ మందు తాగి డ్రైవింగ్ చేస్తున్నవారికి మాత్రం బిగ్ రిలీఫ్ ఇస్తోంది. చైనాలోని వూహాన్‌లో పుట్టుకొచ్చిన ఈ మహమ్మారి ఇప్పటికే 900 మందికిపైగా ప్రాణాలను హరించి 26 దేశాలకు వ్యాపించి చుక్కలు చూపిస్తుంటే మనదేశంలో కొన్ని పట్టణాల్లో మాత్రం మందుబాబులకు బూస్ట్ ఇస్తోంది. నోట్లో నుంచి ‘క’ అనే అక్షరం వింటేనే కరోనా వైరస్‌ను తలచుకొని భయపడుతుంటే మందేసి డ్రైవింగ్ చేసేవారు మాత్రం తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇదేంటి కరోనా వైరస్‌తో ప్రపంచం మొత్తం బిక్కుబిక్కుమంటుంటే మందుబాబులు ఎందుకు ఎంజాయ్ చేస్తున్నారు అనే సందేహం రావ్చొచ్చు. ఆ వివరాలను ఒకసారి గమనిస్తే షాక్ అవ్వడంతోపాటు నవ్వుకొని తీరుతారు.
‘కరోనా’ రక్కసి మొదటగా కేరళలోకి వచ్చి మనదేశంలో అలజడికి ఆజ్యంపోయగా అప్పట్నుంచి జనాలంతా వందకు వెయ్యిరెట్ల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ వైరస్ భూతం జోలికి పోవుడు ఎందుకనుకున్న పోలీసులు సైతం అసలు డ్రంకన్ డ్రైవ్‌లు చేయడమే మానేస్తున్నారు. కార్లు, ఇతర వాహనాలు ఆపి బ్రీత్ అనలైజర్‌తో ఊదమని చెప్పాక అనుమానం వస్తే స్ట్రాపైపుతో మరోసారి ఊదించి ఆల్కహాల్ కౌంట్ రికార్డు చేస్తారు. అయితే ఇలా ఆల్కహాల్‌ను రికార్డు చేసే క్రమంలో ఒకరు ఊదిన స్ట్రా పైపును మరొకరు ఊదితే లేని ప్రమాదాన్నితెచ్చుకున్నట్లు అవుతుందని దేశవ్యాప్తంగా పోలీసులు చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో కరోనా వైరస్ ఉన్నవారు బ్రీత్ అనలైజర్‌లో ఊదితే ఆ గాలి సోకి పోలీసులతోపాటు బ్రీత్ అనలైజర్ ఉపయోగించినవారు ఉత్త పుణ్యానికి ప్రమాదం అంచుల్లో చిక్కుకోవడం ఖాయం.
ఈ నేపథ్యంలో బెంగళూరులో పోలీసులు ఇప్పటికే అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. వీకెండ్ సమయాల్లో ఎక్కువగా డ్రంకన్ డ్రైవ్‌లు నిర్వహించడం వల్ల వైరస్ వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో కొద్దిరోజుల పాటు టెస్టులను నిలిపివేయాలని బెంగళూరు ట్రాఫిక్ పోలీసు విభాగం అధికారికంగా ప్రకటించింది. దీంతో పట్టణంలో పోలీసులు డ్రంకన్ డ్రైవ్ నిర్వహిస్తలేరని తెలుసుకున్న మందుబాబులు ఎలాంటి భయం లేకుండా వాహనాలను నడుపుతూనే ఉన్నారు. మద్యం తాగి వాహనం నడిపినా పోలీసులు పట్టుకునే ప్రసక్తేలేదని కొన్నిచోట్ల యూత్ రెచ్చిపోతుంది. కానీ, మద్యం తాగినవారు వాహనం నడిపి పోలీసులకు దొరికితే ఇదివరకు జరిమానాలు కట్టి జైలు కెళ్లేవారు. కానీ కరోనా వైరస్ పుణ్యమా అని మందు తాగి ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ పోలీసులకు దొరక్కుండా ‘ఫుల్ రిలీఫ్’ పొందుతున్నారు.