పన్ను చెల్లించే విదేశీ ఈ-కామర్స్ కంపెనీలకు డిజిటల్ ట్యాక్స్ రద్దు!
దిశ, వెబ్‌డెస్క్: విదేశీ సంస్థల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ ఈ-కామర్స్ సంస్థలకు చెందిన భారత విభాగాల ద్వారా వస్తువులు, సేవల విక్రయం నిర్వహిస్తే 2 శాతం డిజిటల్ సర్వీస్ ట్యాక్స్ విధించకూడదని కేంద్రం నిర్ణయించింది. అలాగే, భారత్‌లో ఆదాయపు పన్ను చెల్లించే విదేశీ ఈ-కామర్స్ కంపెనీలకు కూడా ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఫైనాన్స్ బిల్-2021 సవరణల ప్రకారం.. భారత్‌లో శాశ్వతంగా స్థాపించబడిన లేదా దేశీయంగా ఆదాయపు పన్ను చెల్లిస్తున్న విదేశీ ఈ-కామర్స్ […]
దిశ, వెబ్‌డెస్క్: విదేశీ సంస్థల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ ఈ-కామర్స్ సంస్థలకు చెందిన భారత విభాగాల ద్వారా వస్తువులు, సేవల విక్రయం నిర్వహిస్తే 2 శాతం డిజిటల్ సర్వీస్ ట్యాక్స్ విధించకూడదని కేంద్రం నిర్ణయించింది. అలాగే, భారత్‌లో ఆదాయపు పన్ను చెల్లించే విదేశీ ఈ-కామర్స్ కంపెనీలకు కూడా ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఫైనాన్స్ బిల్-2021 సవరణల ప్రకారం.. భారత్‌లో శాశ్వతంగా స్థాపించబడిన లేదా దేశీయంగా ఆదాయపు పన్ను చెల్లిస్తున్న విదేశీ ఈ-కామర్స్ కంపెనీలు 2 శాతం డిజిటల్ సర్వీస్ ట్యాక్స్ చెల్లించనవసరం లేదు. అందరికీ సమానమైన అవకాశాలను కల్పించాలనే కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. 2020, ఏప్రిల్‌లో ప్రవేశపెట్టిన ఈ డిజిటల్ సేవల సుంకం రూ. 2 కోట్లు అంతకంటే ఎక్కువ ఆదాయాన్ని కలిగిన విదేశీ కంపెనీలకు మాత్రమే వర్తిస్తుంది. విదేశీ కంపెనీలు చేస్తున్న ఆన్‌లైన్ వస్తు సేవల విక్రయాలు కూడా ఈ బిల్లు పరిధిలోకి వస్తాయి.