అప్పుడు గో కరోనా గో.. ఇప్పుడు నో కరోనా నో నో కరోనా

దిశ, వెబ్ డెస్క్ : ఫిబ్రవరిలో ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద “గో కరోనా గో” అంటూ పాపులర్ అయిన కేంద్ర మంత్రి రామ్ దాస్ అథవాలే మరోసారి చర్చాంశనీయమయ్యారు. కరోనా కొత్త వైరస్ ను తరిమి కొట్టేందుకు నో కరోనా అంటూ స్లోగన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను గో కరోనా అంటే నా దగ్గరకే వచ్చింది. నాకు అటాక్ అయితే ఆస్పత్రి పాలయ్యా. అప్పుడే అర్ధమైంది. కరోనా నా […]

Update: 2020-12-28 00:03 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఫిబ్రవరిలో ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద “గో కరోనా గో” అంటూ పాపులర్ అయిన కేంద్ర మంత్రి రామ్ దాస్ అథవాలే మరోసారి చర్చాంశనీయమయ్యారు. కరోనా కొత్త వైరస్ ను తరిమి కొట్టేందుకు నో కరోనా అంటూ స్లోగన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను గో కరోనా అంటే నా దగ్గరకే వచ్చింది. నాకు అటాక్ అయితే ఆస్పత్రి పాలయ్యా. అప్పుడే అర్ధమైంది. కరోనా నా దగ్గరకే కాదు ఎక్కడికైనా వెళుతుందని వ్యాఖ్యానించారు. పాత వైరస్ తగ్గుముఖం పడుతుందనుకునే సమయంలో కొత్త వైరస్ వ్యాప్తి చెందుతుంది. అందుకే నేను “నో కరోనా,నో కరోనా” స్లోగన్ ఇస్తున్నాను. మనకు పాత కరోనా వైరస్ వద్దూ,ఈ కొత్త వైరస్ వద్దని అథవాలే అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News