హర్యాన సీఎం పై అవిశ్వాస తీర్మానం
దిశ,వెబ్ డెస్క్: రైతుల విషయంలో బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరికి నిరసనగా హర్యనా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ పై కాంగ్రెస్ మాజీ సీఎం అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారు. అయితే ఈ అవిశ్వాస తీర్మణం గురించి ఖట్టర్ మాట్లాడుతూ.. అవిశ్వాసం కాంగ్రెస్ సాంప్రదాయం. ఎన్నికల్లో పార్టీ ఓడిపోయినప్పుడు..ఈవీఎంల పై విశ్వాసం లేదని, సర్జికల్ స్ట్రెయిక్స్ కి రుజువులు అడుగుతారు. ఒక వేళ కాంగ్రెస్ అధికారంలో ఉంటే వారికి అంతా బాగుండేది. ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంటే […]
దిశ,వెబ్ డెస్క్: రైతుల విషయంలో బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరికి నిరసనగా హర్యనా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ పై కాంగ్రెస్ మాజీ సీఎం అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారు. అయితే ఈ అవిశ్వాస తీర్మణం గురించి ఖట్టర్ మాట్లాడుతూ.. అవిశ్వాసం కాంగ్రెస్ సాంప్రదాయం. ఎన్నికల్లో పార్టీ ఓడిపోయినప్పుడు..ఈవీఎంల పై విశ్వాసం లేదని, సర్జికల్ స్ట్రెయిక్స్ కి రుజువులు అడుగుతారు. ఒక వేళ కాంగ్రెస్ అధికారంలో ఉంటే వారికి అంతా బాగుండేది. ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంటే వారికి ఏదీ బాగున్నట్లు అనిపించదు ఏదీ నచ్చట్లేదు. దీని బట్టి కాంగ్రెస్ లోని అపనమ్మకాన్ని చూడవచ్చు అన్నారు.
కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోవాలంటే అధికార పక్షానికి కనీసం 44 మంది సభ్యుల మద్దతు అవసరం . కాగా ఆ రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 88 మంది ఎమ్మెల్యేలున్నారు. అందులో అధికా బీజేపీ సభ్యులు 40మంది, దాని మిత్రపక్షం జేజేపీ సభ్యులు 10 ఉన్నారు. ఇక మిత్రపక్షం కాంగ్రెస్ కు30 మంది సభ్యుల బలం ఉండగా , ఇద్దరు మద్దతు ఇస్తున్నారు అని అంటున్నారు. అయితే కాంగ్రెస్ కు ఇద్దరు స్వతంత్రులు మద్దతు ఇచ్చిన అధికారపక్షానికి ఇబ్బంది ఏం లేనట్లే కనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీలో 40మంది సభ్యలు, జేజేపీ 10 స్థానాలు, 6స్వతంత్రులు మద్దతు ఇస్తుడటంతో అధికార పక్షానికి ఎలాంటి నష్టం వాటిల్లేలా కనిపించడంలేదు.