భారత్‌లో సమూహ వ్యాప్తి లేదు: కేంద్రం

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తిలో భారత్ సమూహ దశకు చేరలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాదు, ఈ మహమ్మారి వేగంగా విస్తరించకుండా లాక్‌డౌన్ కట్టడి చేయగలిగిందని పేర్కొంది. ఈ వైరస్ కేవలం ఒక్కశాతం జనాభా ఉన్న 83 జిల్లాల్లోనే ఎక్కువగా ఉన్నదని వెల్లడించింది. కొవిడ్ 19 వ్యాప్తిపై నిర్వహించిన తొలి సీరో సర్వేను విడుదల చేస్తూ ఈ మేరకు వివరించింది. ముంబయి, ఢిల్లీలాంటి నగరాల్లో కరోనా కేసులు భారీగా వెలుగుచూస్తున్న నేపథ్యంలో భారత్ మూడో దశ […]

Update: 2020-06-11 11:03 GMT

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తిలో భారత్ సమూహ దశకు చేరలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాదు, ఈ మహమ్మారి వేగంగా విస్తరించకుండా లాక్‌డౌన్ కట్టడి చేయగలిగిందని పేర్కొంది. ఈ వైరస్ కేవలం ఒక్కశాతం జనాభా ఉన్న 83 జిల్లాల్లోనే ఎక్కువగా ఉన్నదని వెల్లడించింది. కొవిడ్ 19 వ్యాప్తిపై నిర్వహించిన తొలి సీరో సర్వేను విడుదల చేస్తూ ఈ మేరకు వివరించింది. ముంబయి, ఢిల్లీలాంటి నగరాల్లో కరోనా కేసులు భారీగా వెలుగుచూస్తున్న నేపథ్యంలో భారత్ మూడో దశ వ్యాప్తికి చేరిందా? అనే విషయంపై అనుమానాలు వెల్లువెత్తాయి. సమూహ వ్యాప్తిపై విస్తృతంగా చర్చ నడుస్తున్నదని, అయితే, ఈ పదాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంకా నిర్వచించనే లేదని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ తెలిపారు. మనదేశంలో ఈ వైరస్ వ్యాప్తి స్వల్పంగానే ఉన్నదని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో కొంత ఎక్కువగా ఉన్నదని, కంటైన్‌మెంట్ జోన్‌లలో ఇంకాస్త ఎక్కువ కేసులు రిపోర్ట్ అవుతున్నాయని వివరించారు. మనదేశంలో చాలా వరకు వైరస్ వేగానికి కళ్లెం వేసిందని, కంటైన్‌మెంట్ ఏరియాల్లో ఇంకా లాక్‌డౌన్ కొనసాగించాల్సిన అవసరమున్నదని అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News