ఈ సారి బట్టల పంపిణీ లేదు: హరీశ్ రావు
దిశ, మెదక్ : ‘ఈ సారి బట్టల పంపిణీ కుదరదు.. కారణం మీకు తెలుసు మీకు తెలుసు కదా.. మీరు చెప్పిన విధంగా అనుసరించండి’ అంటూ మంత్రి హరీశ్ రావు పలు అంశాలను చెప్పుకొచ్చారు. గజ్వేల్ లో విష్ణు జగతి సౌజన్యంతో శుక్రవారం పేద ముస్లింలకు రంజాన్ పండుగ సందర్భంగా బియ్యం, నిత్యావసర సరుకులు మంత్రి హరీశ్ రావు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాపరెడ్డి, డాక్టర్ యాదవ రెడ్డి, గడ ఆఫీసర్ ముత్యంరెడ్డి, […]
దిశ, మెదక్ : ‘ఈ సారి బట్టల పంపిణీ కుదరదు.. కారణం మీకు తెలుసు మీకు తెలుసు కదా.. మీరు చెప్పిన విధంగా అనుసరించండి’ అంటూ మంత్రి హరీశ్ రావు పలు అంశాలను చెప్పుకొచ్చారు. గజ్వేల్ లో విష్ణు జగతి సౌజన్యంతో శుక్రవారం పేద ముస్లింలకు రంజాన్ పండుగ సందర్భంగా బియ్యం, నిత్యావసర సరుకులు మంత్రి హరీశ్ రావు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాపరెడ్డి, డాక్టర్ యాదవ రెడ్డి, గడ ఆఫీసర్ ముత్యంరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, వైస్ చైర్మన్ జఖి, మాదాసు శ్రీనివాస్, బెండే మధు యాదగిరి, తెరాస నాయకులు కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నిరంతరం ప్రజల సంక్షేమం కోసం ఆలోచిస్తూన్నారని అన్నారు. కరోనా కారణంగా ప్రతిసారి ఇచ్చే బట్టల పంపిణీ కార్యక్రమం ఈసారి ఇవ్వడం కుదరలేదన్నారు. అల్లా దయతో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టాలని ఆకాంక్షించారు. అందరూ ఇంటిలోనే ఉండాలి, అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని, భౌతిక దూరం పాటించాలన్నారు. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకోవాలన్నారు. నమాజ్ చేసే సందర్భంలో భౌతిక దూరం పాటిస్తూ ఇంటిలోనే చేసుకోవాలన్నారు. గజ్వేల్ లో ఇంటింటికీ గోదావరి నీళ్లు ఇచ్చాం.. త్వరలోనే అర్హులైన వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామన్నారు. అదేవిధంగా సహాయం చేసేందుకు ముందుకు వచ్చిన విష్ణు జగతి వారిని మంత్రి అభినందించారు.