ల్యాండ్ రిజిస్ట్రేషన్లు : నో క్లారిటీ .. ఓన్లీ కన్ఫ్యూజన్

దిశ, వెబ్‌డెస్క్ : గడిచిన రెండు రోజుల కంటే గురువారం రోజు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కాస్తవేగవంతం అయినా..,ఈ రిజిస్ట్రేషన్ల ప్రాసెస్ లో క్లారిటీ కన్నా కన్ఫ్యూజనే ఎక్కువగా ఉందని సామాన్యులు వాపోతున్నారు. నిన్నమొన్న రెండు మూడు స్లాట్లు బుక్ అయితే నేడు 12స్లాట్లు బుక్ అయినట్లు వనస్థలీపురం సబ్ రిజిస్టార్ అధికారులు చెబుతున్నారు. కానీ అక్కడికి వచ్చిన సామాన్యులు మాత్రం రిజిస్ట్రేషన్లలో గందరగోళం నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాటిగేజ్ కంప్లీట్ చేసుకొని మూడునెలలు అవుతున్న ఎంవోడీ […]

Update: 2020-12-16 01:44 GMT

దిశ, వెబ్‌డెస్క్ : గడిచిన రెండు రోజుల కంటే గురువారం రోజు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కాస్తవేగవంతం అయినా..,ఈ రిజిస్ట్రేషన్ల ప్రాసెస్ లో క్లారిటీ కన్నా కన్ఫ్యూజనే ఎక్కువగా ఉందని సామాన్యులు వాపోతున్నారు. నిన్నమొన్న రెండు మూడు స్లాట్లు బుక్ అయితే నేడు 12స్లాట్లు బుక్ అయినట్లు వనస్థలీపురం సబ్ రిజిస్టార్ అధికారులు చెబుతున్నారు. కానీ అక్కడికి వచ్చిన సామాన్యులు మాత్రం రిజిస్ట్రేషన్లలో గందరగోళం నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాటిగేజ్ కంప్లీట్ చేసుకొని మూడునెలలు అవుతున్న ఎంవోడీ ఇవ్వలేదని అంటున్నారు. తాము ధరణి లో పీటీ (ప్రొఫెషన్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ) నెంబర్ ఇచ్చినా అధికారులు మాత్రం పీటీ నెంబర్ లేదని చెబుతున్నారని వాపోయారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్లకు కంప్లీట్ చేసుకున్నవారిని పీటీ నెంబర్ గురించి అడగ్గా..ధరణిలో పీటీ నెంబర్ అవసరంలేదని చెబుతుంటే అధికారులు పీటీ నెంబర్ అడగడం ఏంటని ప్రశ్నించారు. కేబినేట్ సబ్ కమిటీలో పీటీఐ నెంబర్ లేకపోయినా రిజిస్ట్రేషన్ చేసుకునే వెసలుబాటు కల్పిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అధికారులు మాత్రం అందుకు సంబంధించిన ప్రొవిజన్ రాలేదని చెబుతున్నారు. దీంతో అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు సామాన్యులు.

Tags:    

Similar News