సిద్దిపేట జిల్లాలో కరోనా కేసులు నిల్ 

దిశ, మెదక్: కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు సిద్దిపేట జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఇప్పటివరకు జిల్లా నుంచి ఒకే ఒక కరోనా కేసు నమోదైంది. ఆ రోగి కూడా గురువారం హాస్పిటల్ నుంచి డిశ్చార్చ్ అయ్యారు. మళ్లీ కొత్త కేసులు కూడా నమోదు కాలేదు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు లేని జిల్లాల్లో ఒకటిగా సిద్దిపేట నిలిచింది. గజ్వేల్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చారు. ఆయనకు […]

Update: 2020-04-18 09:17 GMT
దిశ, మెదక్: కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు సిద్దిపేట జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఇప్పటివరకు జిల్లా నుంచి ఒకే ఒక కరోనా కేసు నమోదైంది. ఆ రోగి కూడా గురువారం హాస్పిటల్ నుంచి డిశ్చార్చ్ అయ్యారు. మళ్లీ కొత్త కేసులు కూడా నమోదు కాలేదు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు లేని జిల్లాల్లో ఒకటిగా సిద్దిపేట నిలిచింది. గజ్వేల్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చారు. ఆయనకు కరోనా లక్షణాలు ఉండటంతో హైదరాబాద్‌లోని గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. ఈ నెల 1న అడ్మిటైన ఆ వ్యక్తికి డాక్టర్లు వైద్యం అందించారు. గురువారం ఉదయం వ్యాధి నుంచి పూర్తిగా కోలుకోవడంతో ఆరోగ్యశాఖ అధికారులు ఆయన్ని డిశ్చార్జ్ చేశారు. సిద్దిపేట జిల్లాలో ఇప్పటివరకు ఒకే ఒక వ్యక్తికి పాజిటివ్ రాగా, అతడు కాస్త ఆరోగ్యంగా బయటపడటంతో జిల్లావాసులు ఊపిరి పీల్చున్నారు. రానున్న రోజుల్లో కొత్త కేసులు నమోదు కాకపోతే జిల్లాను గ్రీన్ జోన్‌గా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Tags: no carona cases in siddipet,gajwel patient discharge,gandi hospital
Tags:    

Similar News