కారు ఢీ..ఇద్దరు చిన్నారులు దుర్మరణం
దిశ, నిజామాబాద్: జాతీయ రహదారి రోడ్డు అంచున నడుచుకుంటూ వెళ్తున్న నలుగురు చిన్నారులను వెనుకనుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.ఈ ఘటన గురువారం రాత్రి నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని హాసాకొత్తూర్ చౌరస్తా వద్ద చోటుచేసుకుంది.పోలీసుల కథనం ప్రకారం..66వ జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి ప్రమాదవశాత్తు పిల్లలపైకి దూసుకువచ్చింది.ఇద్దరు పిల్లలకు తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతిచెందారు.మిగతా ఇద్దరికి తీవ్ర గాయాలవ్వడంతో వారిని […]
దిశ, నిజామాబాద్: జాతీయ రహదారి రోడ్డు అంచున నడుచుకుంటూ వెళ్తున్న నలుగురు చిన్నారులను వెనుకనుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.ఈ ఘటన గురువారం రాత్రి నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని హాసాకొత్తూర్ చౌరస్తా వద్ద చోటుచేసుకుంది.పోలీసుల కథనం ప్రకారం..66వ జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి ప్రమాదవశాత్తు పిల్లలపైకి దూసుకువచ్చింది.ఇద్దరు పిల్లలకు తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతిచెందారు.మిగతా ఇద్దరికి తీవ్ర గాయాలవ్వడంతో వారిని పోలీసు వాహనంలో స్థానిక ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన, గాయపడిన వారి పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.