నిజామాబాద్‌ మేయర్ ‘లాక్‌డౌన్’ పరిశీలన

దిశ, నిజామాబాద్: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో నిజామాబాద్ నగరంలో దాని పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునేందుకు మేయర్ నీతూకిరణ్ రోడ్డు మీదకు వచ్చి పరిశీలించారు. గురువారం నగరంలోని మున్సిపల్ జోన్ కార్యాలయాల్లో కార్మికుల హాజరు పట్టికను తనిఖీ చేశారు.దేశంలో కరోనా వ్యాధి అంతకంతకూ పెరుగుతున్నందున మున్సిపల్ కార్మికులు నిర్వహిస్తున్న విధుల పట్ల హర్షం వ్యక్తం చేశారు. అలాగే కార్మికులు పని వేళలో తగు జాగ్రత్తలు తీసుకోవాలనిసూచించారు. వారి కోసం కొత్తగా నోటి ముసుగులు, చేతి గ్లౌసులు, […]

Update: 2020-03-26 07:25 GMT

దిశ, నిజామాబాద్: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో నిజామాబాద్ నగరంలో దాని పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునేందుకు మేయర్ నీతూకిరణ్ రోడ్డు మీదకు వచ్చి పరిశీలించారు. గురువారం నగరంలోని మున్సిపల్ జోన్ కార్యాలయాల్లో కార్మికుల హాజరు పట్టికను తనిఖీ చేశారు.దేశంలో కరోనా వ్యాధి అంతకంతకూ పెరుగుతున్నందున మున్సిపల్ కార్మికులు నిర్వహిస్తున్న విధుల పట్ల హర్షం వ్యక్తం చేశారు. అలాగే కార్మికులు పని వేళలో తగు జాగ్రత్తలు తీసుకోవాలనిసూచించారు. వారి కోసం కొత్తగా నోటి ముసుగులు, చేతి గ్లౌసులు, సబ్బులను అందజేశారు. నగరంలో లాక్‌డౌన్ కొనసాగుతున్నందున గంజ్‌లో కూరగాయల మార్కెట్‌ను సందర్శించారు. అధిక ధరలకు ఎవరూ వెజిటబుల్స్ విక్రయించరాదని వ్యాపారస్తులకు చెప్పారు. అందరూ సోషల్ డిస్టెన్స్ పాటించడమే కాకుండా, ఇతరులకు ఇబ్బంది కల్గించవద్దన్నారు. కార్యక్రమంలో ఆర్‌డిఓ, ఎంహెచ్ఓలు పాల్గొన్నారు.

Tags : corona, lockdown, nizamabad mayor, municipal workers, attendance register verify

Tags:    

Similar News