కవితకు మళ్లీ నిరాశే.. ఆ ఎన్నిక వాయిదా

దిశ, నిజామాబాద్: నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక మరోసారి వాయిదా పడింది. ఏప్రిల్ మొదటి వారంలోనే జరగాల్సిన ఈ ఎన్నిక లాక్‌డౌన్ కారణంగా గతంలో వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే, మరోసారి ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే మరో 45 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆగస్టు మొదటి వారంలో నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉపఎన్నిక జరిగే […]

Update: 2020-05-22 09:21 GMT

దిశ, నిజామాబాద్: నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక మరోసారి వాయిదా పడింది. ఏప్రిల్ మొదటి వారంలోనే జరగాల్సిన ఈ ఎన్నిక లాక్‌డౌన్ కారణంగా గతంలో వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే, మరోసారి ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే మరో 45 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆగస్టు మొదటి వారంలో నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉపఎన్నిక జరిగే అవకాశముంది. కాగా, ఈ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరుఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ తనయా, మాజీ ఎంపీ కల్పకుంట్ల కవిత బరిలోకి దిగిన విషయం విధితమే. గెలుపు లాంఛనమైనా.. ఈసీ ఉత్తర్వులతో కవితకు మరోసారి కూడా నిరాశే ఎదురైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags:    

Similar News