కరోనా నియంత్రణకు కఠిన చర్యలు
దిశ, నిజామాబాద్: కరోనా నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శరత్ అన్నారు. కామారెడ్డి ఆర్డీవో కార్యాలయంలో వివిధ మండలాల అధికారులతో సోమవారం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మద్నూరు సరిహద్దులోని రోడ్లను మూసి ఉంచాలని సూచించారు. బ్యాంకుల వద్ద సామాజిక దూరం పాటించాలని, ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. లేకపోతే తహసీల్దార్, ఎస్సైపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విధి నిర్వహణలో అప్రమత్తంగా వ్వవహరించాలని అన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిని […]
దిశ, నిజామాబాద్: కరోనా నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శరత్ అన్నారు. కామారెడ్డి ఆర్డీవో కార్యాలయంలో వివిధ మండలాల అధికారులతో సోమవారం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మద్నూరు సరిహద్దులోని రోడ్లను మూసి ఉంచాలని సూచించారు. బ్యాంకుల వద్ద సామాజిక దూరం పాటించాలని, ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. లేకపోతే తహసీల్దార్, ఎస్సైపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విధి నిర్వహణలో అప్రమత్తంగా వ్వవహరించాలని అన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిని ఏప్రిల్ 21 వరకు క్వారంటైన్ లో ఉంచాలని సూచించారు. రోడ్లపై ఉమ్మి వేస్తే కేసులు నమోదు చేయాలని చెప్పారు. గ్రామాల్లో వలస కార్మికులకు భోజనం, ఉపాధి హామీ కూలీలకు పనులు కల్పించాలని అన్నారు.
లాక్‌డౌన్ కు సహకరించాలి: ఎస్పీ
కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌కు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్పీ శ్వేత కోరారు. మహారాష్ట్రలో కరోనా వైరస్ తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో అక్కడి నుంచి వచ్చే వాహనాలను అనుమతించవద్దని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌లు యాదిరెడ్డి, వెంకటేష్ దోతురే, అసిస్టెంట్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్, డీపీఓ సాయన్న తదితరులు పాల్గొన్నారు.
Tags;NIzamabad collector sharath,video conference,mro