అసిస్టెంట్ ప్రొఫెసర్లపై నిజాం కాలేజీ ప్రిన్సిపాల్ వేధింపులు
దిశ, తెలంగాణ బ్యూరో: నిజాం కళాశాల ప్రిన్సిపాల్ బీ నారాయణ కాంట్రాక్ట్ అధ్యాపకులను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో వారు తెలంగాణ మానవహక్కుల కమిషన్ ను శనివారం ఆశ్రయించారు. తామంతా 20 ఏండ్లుగా ఈ వృత్తిలో కొనసాగుతున్నామని, అయితే కావాలనే తమను బదిలీ చేస్తూ వేధిస్తున్నారని అన్నారు. మహిళా అధ్యాపకులని కూడా చూడకుండా అవమానించేలా వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి తమను బదిలీ చేస్తున్నట్లు […]
దిశ, తెలంగాణ బ్యూరో: నిజాం కళాశాల ప్రిన్సిపాల్ బీ నారాయణ కాంట్రాక్ట్ అధ్యాపకులను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో వారు తెలంగాణ మానవహక్కుల కమిషన్ ను శనివారం ఆశ్రయించారు. తామంతా 20 ఏండ్లుగా ఈ వృత్తిలో కొనసాగుతున్నామని, అయితే కావాలనే తమను బదిలీ చేస్తూ వేధిస్తున్నారని అన్నారు. మహిళా అధ్యాపకులని కూడా చూడకుండా అవమానించేలా వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి తమను బదిలీ చేస్తున్నట్లు మౌఖిక ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకుండా మౌఖికంగా చెప్పడం సరికాదని వారు పేర్కొన్నారు. తాము వినకపోవడంతో హాజరు పట్టికను దాచి విధులకు హాజరుకాలేదని చెప్పడం తగదన్నారు. నిజాం కళాశాల ప్రన్సిపాల్ నారాయణ మహిళా టీచర్లను ఫోన్లో వేధింపులకు గురిచేస్తున్నారని అందుకే తమ గోడును తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్యను కలిసి వెళ్లబోసుకున్నట్లు పేర్కొన్నారు. తమను ఇబ్బంది పెడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మానవహక్కుల కమిషన్ చైర్మన్ ను కలిసిన వారిలో కాంట్రాక్ట్ అధ్యాపకులు పరశురాం, ధర్మతేజ, ప్రియ, శ్రీనివాస్, సనత్, ప్రేమయ్య, వినితాపాండే, పరేమేశ్వరి, బాలకోఠి, కిరణ్, రవికుమార్తదితరులు పాల్గొన్నారు.