మళ్లీ బిహార్ సీఎం నితీష్ కుమార్!

దిశ, వెబ్‌డెస్క్: ఎన్డీయేలో జేడీయూ కంటే అత్యధిక సీట్లు బీజేపీ సాధించడంతో రాష్ట్రంలో కాబోయే ముఖ్యమంత్రి ఎవరనేదానిపై ఉత్కంఠ ఏర్పడింది. సీట్ల పంపకాల సమయంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థిపై బీజేపీ, జేడీయూలో అంతర్గతంగా ఆశలు, అసంతృప్తులు రేగాయి. కానీ, ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా వరకు అందరూ తమ సీఎం క్యాండిడేట్ నితీష్ కుమారేనని ప్రకటించారు. ఫలితాల్లో జేడీయూ కంటే ఎక్కువ సీట్లు బీజేపీ గెలుచుకున్నా నితీష్ సారథ్యంలోనే సర్కారును ఏర్పాటు చేస్తామని తెలిపారు. కానీ, […]

Update: 2020-11-10 10:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎన్డీయేలో జేడీయూ కంటే అత్యధిక సీట్లు బీజేపీ సాధించడంతో రాష్ట్రంలో కాబోయే ముఖ్యమంత్రి ఎవరనేదానిపై ఉత్కంఠ ఏర్పడింది. సీట్ల పంపకాల సమయంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థిపై బీజేపీ, జేడీయూలో అంతర్గతంగా ఆశలు, అసంతృప్తులు రేగాయి. కానీ, ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా వరకు అందరూ తమ సీఎం క్యాండిడేట్ నితీష్ కుమారేనని ప్రకటించారు. ఫలితాల్లో జేడీయూ కంటే ఎక్కువ సీట్లు బీజేపీ గెలుచుకున్నా నితీష్ సారథ్యంలోనే సర్కారును ఏర్పాటు చేస్తామని తెలిపారు. కానీ, బీజేపీ అనూహ్య ఫలితాలు సాధించడంతో సీఎం కుర్చీపై అనిశ్చితి నెలకొంది. ముఖ్యమంత్రి కుర్చీపై వివాదానికి తావులేదని, నితీష్ కుమారే తమ ముఖ్యమంత్రి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ జైస్వాల్ స్పష్టం చేశారు.

Tags:    

Similar News