రాష్ట్రాలు వ్యాక్సిన్ కొనవద్దు..

దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌కు మందు కనిపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాము వ్యాక్సిన్ కనిపెట్టామని రష్యా ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. అయితే, దాని మీద ప్రపంచ దేశాలు, డబ్ల్యూ‌హెచ్‌వో పలు అనుమానాలు వ్యక్తంచేస్తోంది. ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కీలక ఉత్తర్వులు జారీచేసింది. ప్రపంచంలో ఎక్కడ వ్యాక్సిన్ వచ్చినా తమను సంప్రదించకుండా కొనుగోలు చేయొద్దని నీతి అయోగ్ ఆధ్వర్యంలోని కమిటీ సూచించింది. కేంద్ర ప్రభుత్వమే వ్యాక్సిన్‌ను ఎంపిక చేస్తుందని.. […]

Update: 2020-08-13 01:15 GMT

దిశ, వెబ్ డెస్క్ :

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌కు మందు కనిపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాము వ్యాక్సిన్ కనిపెట్టామని రష్యా ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. అయితే, దాని మీద ప్రపంచ దేశాలు, డబ్ల్యూ‌హెచ్‌వో పలు అనుమానాలు వ్యక్తంచేస్తోంది. ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కీలక ఉత్తర్వులు జారీచేసింది.

ప్రపంచంలో ఎక్కడ వ్యాక్సిన్ వచ్చినా తమను సంప్రదించకుండా కొనుగోలు చేయొద్దని నీతి అయోగ్ ఆధ్వర్యంలోని కమిటీ సూచించింది. కేంద్ర ప్రభుత్వమే వ్యాక్సిన్‌ను ఎంపిక చేస్తుందని.. అంతేకానీ, రాష్ట్రాలు తమ ఇష్టారీతిలో వ్యవహరించొద్దని ఆదేశించింది. వ్యాక్సిన్ లభ్యత, సరఫరా విధానం, దానిని చేరవేయడంలో తీసుకోవాల్సిన చర్యలపై జాతీయ సాంకేతిక సలహా బృందం వివరాలను నీతి అయోగ్ అడిగి తెలుసుకుంది.

Tags:    

Similar News