‘హర్ సర్కిల్’..నీతా అంబానీ ఉమెన్స్ డే కానుక

దిశ, ఫీచర్స్: మహిళల సాధికారత లక్ష్యంగా రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా ముఖేష్ అంబానీ మహిళా దినోత్సవ కానుకగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘హర్ సర్కిల్(Her Circle)’ను ప్రారంభించింది. భిన్న సంస్కృతులు, వర్గాలు, దేశాలకు చెందిన మహిళలు తమ ఆలోచనలను పంచుకునేందుకు తోడ్పాడునివ్వడంతో పాటు, ప్రపంచవ్యాప్తంగా సోద‌ర‌త‌త్వాన్ని, సమానత్వాన్ని బ‌లోపేతం చేసేందుకు ఇది వేదిక కానుంది. తమ విజయాలతో అవని, ఆకాశాలను ఏలుతున్న మహిళలకు ఓ చక్కని వేదికగా ‘హర్ సర్కిల్’ రూపొందించారు. ఇందులో ఉచితంగా నమోదు […]

Update: 2021-03-08 07:12 GMT

దిశ, ఫీచర్స్: మహిళల సాధికారత లక్ష్యంగా రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా ముఖేష్ అంబానీ మహిళా దినోత్సవ కానుకగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘హర్ సర్కిల్(Her Circle)’ను ప్రారంభించింది. భిన్న సంస్కృతులు, వర్గాలు, దేశాలకు చెందిన మహిళలు తమ ఆలోచనలను పంచుకునేందుకు తోడ్పాడునివ్వడంతో పాటు, ప్రపంచవ్యాప్తంగా సోద‌ర‌త‌త్వాన్ని, సమానత్వాన్ని బ‌లోపేతం చేసేందుకు ఇది వేదిక కానుంది. తమ విజయాలతో అవని, ఆకాశాలను ఏలుతున్న మహిళలకు ఓ చక్కని వేదికగా ‘హర్ సర్కిల్’ రూపొందించారు. ఇందులో ఉచితంగా నమోదు చేసుకోవచ్చు. జీవన విధానం, ఆరోగ్యం, ఉద్యోగం, వ్యక్తిత్వ వికాసం, వెల్‌నెస్, ఫైనాన్స్, ఎంటర్‌టైన్‌మెంట్, బ్యూటీ, ఫ్యాషన్, సొల్యుషన్ ఓరియెంటెడ్ లైఫ్ స్ట్రాటజీస్ వంటి అనేక అంశాలకు సంబంధించిన వీడియోలు, ఆర్టికల్స్‌ మొదలైనవి హర్‌ సర్కిల్‌ సబ్‌స్క్రైబర్స్‌కు అందుబాటులో ఉంటాయి.

ఇందులో సభ్యులైన మహిళలకు హెల్త్, ఎడ్యుకేషన్, ఎంట్రప్రెన్యూర్‌షిప్, ఫైనాన్స్, ఫిలాంత్రపీ, మెంటర్‌షిప్, లీడర్‌షిప్ వంటి అంశాలపై మహిళలకు వచ్చే సందేహాలపై రిలయన్స్ నిపుణుల బృందం నుంచి సమాధానాలను అందిస్తారు. నైపుణ్యత సాధించడంలో ఉద్యోగాలు పొందడంలో సాయమందించడంతో పాటు ఆమెకు వృత్తిపరమైన నైపుణ్యాలను అందిస్తారు. ఆమె ప్రొఫైల్‌కు తగిన ఉద్యోగ అవకాశాలను పొందుతుంది. ది బెస్ట్ బిజినెస్‌మ్యాన్స్ నుంచి వ్యాపారంలో టిప్స్ అందిస్తారు. మహిళలు తమ విజయ గాథలను పంచుకునేందుకు అద్భుతమైన ప్లాట్‌ఫామ్‌గా ఇది నిలుస్తుంది. ప్రస్తుతం ఇంగ్లిష్‌లో అందుబాటులో ఉన్న ‘హర్‌ సర్కిల్‌’ క్రమంగా ఇతర భాషల్లో కూడా అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

‘లక్షలాది మంది మహిళలు తమ కలలను సాకారం చేసుకోవడానికి ‘హర్ సర్కిల్.ఇన్’ అనే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ రూపొందించాం. యావత్ దేశాల మ‌హిళ‌ల‌ను ఇందులో భాగస్వాములవుతారు. అన్ని సామాజిక వ‌ర్గాల మ‌హిళ‌ల ఆకాంక్షలు, ఆశ‌యాలకు ఇది వేదిక‌గా మారుతుంది. దీన్ని ప్రారంభించినందుకు నాకెంతో ఆనందంగా ఉంది. మా కుటుంబంలో మేం పదకొండు మంది బాలికలం. అంతమంది అమ్మాయిల మధ్య పెరిగిన నాకు మహిళల కోసం ఏం చేస్తే బాగుంటుంది? అని నిరంతరం ఆలోచించేదాన్ని. నా జీవితమంతా స్ట్రాంగ్ ఉమెన్స్ చుట్టూనే గడిచింది. వారి నుంచి కంపాషన్, పాజిటివిటీ గ్రహించాను. నా కూతురు ఈషా అంబానీ నుంచి అన్ కండిషనల్ లవ్, కాన్ఫిడెన్స్ పొందగా, నా కోడ‌లు శ్లోక నుంచి ఎంపతీ, పేషేన్స్ నేర్చుకున్నాను’ అని నీతా తెలిపారు.

 

Tags:    

Similar News