పండుగ వేళ ట్రెండింగ్‌లో నిర్మలా సీతారామన్ పోస్టు.. నెటిజన్ల ఫన్నీ కామెంట్స్ (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్ : జనరేషన్ మారిపోయింది.. దేశ ప్రజలంతా డిజిటల్ చెల్లింపులపైనే ఫోకస్ చేస్తున్నారు. ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉండటంతో Paytm, Phone Pay, Google Payలో డిజిటల్ పేమెంట్స్ పెరిగిపోయాయి. దేశంలో పట్టణ, గ్రామీణ ప్రాంతం అనే తేడా లేకుండా దాదాపు అని షాపుల వద్ద డిజిటల్ పేమెంట్స్ చేసుకునేందుకు వెసులుబాటు ఉంది. అయితే ఇలా డిజిటల్ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ట్విట్టర్‌లో ఓ వీడియోను షేర్ చేశారు. […]
దిశ, వెబ్‌డెస్క్ : జనరేషన్ మారిపోయింది.. దేశ ప్రజలంతా డిజిటల్ చెల్లింపులపైనే ఫోకస్ చేస్తున్నారు. ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉండటంతో Paytm, Phone Pay, Google Payలో డిజిటల్ పేమెంట్స్ పెరిగిపోయాయి. దేశంలో పట్టణ, గ్రామీణ ప్రాంతం అనే తేడా లేకుండా దాదాపు అని షాపుల వద్ద డిజిటల్ పేమెంట్స్ చేసుకునేందుకు వెసులుబాటు ఉంది.
అయితే ఇలా డిజిటల్ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ట్విట్టర్‌లో ఓ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది అనుకుంటున్నారా.?
తెలుగు రాష్ట్రాల్లో పండుగల సందర్భంగా గంగిరెద్దులను వీధుల్లో తిప్పుతూ కొందరు భిక్షాటన చేస్తుంటారు. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఈ వీడియోలో గంగిరెద్దులాడించే వారు ఆ ఎద్దుపై క్యూఆర్ కోడ్ ట్యాగ్‌ను అమర్చి.. వీధుల్లో భిక్షాటన చేస్తున్నారు. డబ్బులు ఇవ్వాలనుకున్న వారు ఆ కోడ్‌ను స్కాన్ చేసి వారికి మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తారు. ఈ వీడియోపై నిర్మల స్పందిస్తూ దేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవం జానపద కళాకారుల వరకూ చేరిందని కొనియాడారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
Recd a video of a Gangireddulata, where alms are given thru a QR code! India’s #digitalpayment revolution, reaching folk artists. In AP + Telangana, Gangireddulavallu dress up old oxen no longer helpful on farms, walk door to door during fests, performing with their nadaswarams pic.twitter.com/8rgAsRBP5v
— Nirmala Sitharaman (@nsitharaman) November 4, 2021