మాజీ ఎమ్మెల్యే ఏలేటికి కరోనా పాజిటివ్

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: నిర్మల్ మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర రెడ్డి కరోనా బారిన పడ్డారు. హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా తనకు కరోనా ఎలా వ్యాప్తి చెందిన విషయం తెలియదని ఆయన చెప్పారు. అపోలో దవాఖానలో తాను చికిత్స పొందుతున్నానని, ఇప్పటివరకూ ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు చెప్పినట్టు మహేశ్వర్ రెడ్డి “దిశ” ప్రతినిధికి తెలిపారు. తనకు కరోనా సోకిన విషయం తెలిసిన వెంటనే మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సహకారంతో […]

Update: 2020-07-28 11:07 GMT

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: నిర్మల్ మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర రెడ్డి కరోనా బారిన పడ్డారు. హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా తనకు కరోనా ఎలా వ్యాప్తి చెందిన విషయం తెలియదని ఆయన చెప్పారు. అపోలో దవాఖానలో తాను చికిత్స పొందుతున్నానని, ఇప్పటివరకూ ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు చెప్పినట్టు మహేశ్వర్ రెడ్డి “దిశ” ప్రతినిధికి తెలిపారు. తనకు కరోనా సోకిన విషయం తెలిసిన వెంటనే మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సహకారంతో అపోలో ఆసుపత్రిలో చేరినట్టు తెలిపారు. ఇప్పటికే తాను పూర్తిగా కోలుకున్నానని తెలిపారు. నిర్మల్ నియోజకవర్గ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తాను నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతోనే కరోనా బారి నుంచి బయటపడ్డానని తెలిపారు.

Tags:    

Similar News