నిమ్మగడ్డకే బాధ్యతలు.. "అర్ధ"రాత్రి ఉత్తర్వులు
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తిరిగి నియామకమయ్యారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం గురువారం అర్థరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు రమేష్ ను తిరిగి నియమిస్తున్నట్లు గవర్నర్ భిశ్వభూషణ్ హరిచందన్ పేరుతో ఓ ప్రకటనను విడుదల చేశారు. ఇందుకు సంబంధించి గెజిట్ ను విడుదల చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ముఖ్యకార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, గత కొద్ది రోజుల నుంచి […]
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తిరిగి నియామకమయ్యారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం గురువారం అర్థరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు రమేష్ ను తిరిగి నియమిస్తున్నట్లు గవర్నర్ భిశ్వభూషణ్ హరిచందన్ పేరుతో ఓ ప్రకటనను విడుదల చేశారు. ఇందుకు సంబంధించి గెజిట్ ను విడుదల చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ముఖ్యకార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
కాగా, గత కొద్ది రోజుల నుంచి నిమ్మగడ్డ రమేష్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఎస్ఈసీ విషయమై ఇటు నిమ్మగడ్డ హైకోర్టుకు వెళ్లారు. ఈ వ్యవహారం అక్కడి నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. ఈ సందర్భంలో నిమ్మగడ్డ వాదనతో ఏకీభవించిన హైకోర్టు ఆయననే తిరిగి నియమించాలని, ఈ విషయమై గవర్నర్ ను నిమ్మగడ్డ కలవాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.