మకాం మార్చిన ఏపీ ఎన్నికల కమిషనర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మకాం మార్చారు. ఎన్నికల సంఘం కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి విజయవాడకు మార్చి ఏడాది కూడా పూర్తి కాకముందే ఆయన మళ్లీ హైదరాబాద్‌లో కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం విశేషం. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా నేపథ్యంలో ఎస్ఈసీకి ప్రభుత్వంతో విభేదాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రక్షణ కల్పించాలంటూ రెండు రోజుల క్రితం కేంద్ర హోం శాఖకు ఆయన లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ లేఖలో […]

Update: 2020-03-20 05:46 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మకాం మార్చారు. ఎన్నికల సంఘం కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి విజయవాడకు మార్చి ఏడాది కూడా పూర్తి కాకముందే ఆయన మళ్లీ హైదరాబాద్‌లో కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం విశేషం.

స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా నేపథ్యంలో ఎస్ఈసీకి ప్రభుత్వంతో విభేదాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రక్షణ కల్పించాలంటూ రెండు రోజుల క్రితం కేంద్ర హోం శాఖకు ఆయన లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ లేఖలో ఆయన ప్రాణహాని ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు.కాగా, లేఖ నేపథ్యంలో రమేష్‌కుమార్‌కు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించామని కేంద్ర హోం శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కేంద్రంగా ఏపీ ఎన్నికల కార్యాలయం ప్రారంభమైందని ఆయన మీడియాకు సమాచారం ఇచ్చారు.

తొమ్మిది నెలల క్రితం హైదరాబాద్‌ బుద్ధ భవన్‌‌లోని ఏపీ ఎలక్షన్ కమిషన్ కార్యాలయం నుంచి విజయవాడలోని బందరు రోడ్డులోని ఆర్అండ్‌బీ ప్రాంగణంలో ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయం నుంచే ఆయన విధులు నిర్వర్తించారు. వివాదం నేపథ్యంలో ఆయన మరోసారి ఏపీ ఎలక్షన్ కమిషన్‌ కార్యాలయాన్ని హైదరాబాద్‌కు మార్చారు. సైఫాబాద్‌లోని ఆంధ్రాభవన్‌లో ఎస్ఈసీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.

tags : sec, nimmagadda ramesh kumar, vijayawada, hyderabad

Tags:    

Similar News