అనాథ పిల్లల మధ్య యంగ్ హీరో బర్త్‌డే

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా పలుమార్లు పెళ్లిని వాయిదావేసుకున్న టాలీవుడ్‌ యంగ్‌ హీరో నిఖిల్‌కు‌.. ఎట్టకేలకు మే 14న పల్లవి వర్మతో పెళ్లి జరిగింది. ప్రభుత్వ లాక్‌డౌన్‌ నిబంధనలను పాటిస్తూ అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఓ ఇంటివాడైన నిఖిల్.. సోమవారం (జూన్ 1న) తన పుట్టినరోజును నిరాడంబరంగా చేసుకున్నారు. గన్నవరం మండలం బుద్ధవరంలోని ‘కేర్ అండ్ షేర్’ అనాథ శరణాలయ చిన్నారుల నడుమ నిఖిల్ తన పుట్టినరోజు జరుపుకున్నారు. కాగా పెళ్ళైన తరువాత నిఖిల్‌కు ఇదే మొదటి […]

Update: 2020-06-01 07:02 GMT

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా పలుమార్లు పెళ్లిని వాయిదావేసుకున్న టాలీవుడ్‌ యంగ్‌ హీరో నిఖిల్‌కు‌.. ఎట్టకేలకు మే 14న పల్లవి వర్మతో పెళ్లి జరిగింది. ప్రభుత్వ లాక్‌డౌన్‌ నిబంధనలను పాటిస్తూ అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఓ ఇంటివాడైన నిఖిల్.. సోమవారం (జూన్ 1న) తన పుట్టినరోజును నిరాడంబరంగా చేసుకున్నారు. గన్నవరం మండలం బుద్ధవరంలోని ‘కేర్ అండ్ షేర్’ అనాథ శరణాలయ చిన్నారుల నడుమ నిఖిల్ తన పుట్టినరోజు జరుపుకున్నారు. కాగా పెళ్ళైన తరువాత నిఖిల్‌కు ఇదే మొదటి పుట్టినరోజు కావడం విశేషం.

‘నా పుట్టినరోజున గన్నవరం కేర్ అండ్ షేర్ చారిటబుల్ ట్రస్ట్ నందు గడిపాను. ఈ ట్రస్ట్ అనాథ పిల్లలను సంరక్షిస్తుంది. సాధారణంగా నా పుట్టినరోజుకు నేను ఖర్చు చేసే మొత్తం అమౌంట్‌ను ఈ సంస్థకు విరాళంగా ఇచ్చాను..’ అని నిఖిల్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ సంక్షోభ సమయంలో అవసరమైన వారికి ఏదైనా సాయం అందించాలని నిఖిల్ ఇచ్చిన పిలుపుతో.. అతడి ఫ్యాన్స్ పేదలకు భోజనం పెట్టారు.

Tags:    

Similar News