రాత్రి కర్ఫ్యూ ఎత్తేస్తూ ఉత్తర్వులు

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటకలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి 10 నుండి ఉదయం 5 గంటల మధ్య నిర్వహించే రాత్రి కర్ఫ్యూ ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో మొదటిసారిగా జూలైలో రాత్రి కర్ఫ్యూ విధించబడింది. అనేక సార్లు పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా కర్ఫ్యూను పొడిగిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో కర్ణాటక ప్రభుత్వం అనేక ఆంక్షలను ఎత్తివేసింది. ఈ క్రమంలో […]

Update: 2021-11-05 06:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటకలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి 10 నుండి ఉదయం 5 గంటల మధ్య నిర్వహించే రాత్రి కర్ఫ్యూ ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో మొదటిసారిగా జూలైలో రాత్రి కర్ఫ్యూ విధించబడింది. అనేక సార్లు పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా కర్ఫ్యూను పొడిగిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో కర్ణాటక ప్రభుత్వం అనేక ఆంక్షలను ఎత్తివేసింది.

ఈ క్రమంలో గుర్రపు పందాలు తిరిగి ప్రారంభించడానికి అనుమతించారు. గుర్రపు పందాలకు హాజరయ్యే రేసింగ్ పోషకుల సంఖ్య వేదిక సీటింగ్ కెపాసిటీ ప్రకారం ఖచ్చితంగా ఉండాలని, అలాగే కరోనా వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్న వ్యక్తులు మాత్రమే రేసింగ్ లో ప్రవేశించడానికి అనుమతించబడతారని సంబంధిత అధికారులు తెలిపారు.

Tags:    

Similar News