అధిక లాభాలతో దూసుకెళ్లిన మార్కెట్లు!

వరుసగా నాలుగు రోజులు నష్టాలను చూసిన మార్కెట్లు బుధవారం భారీ స్థాయిలో లాభాలతో క్లోజయ్యాయి. కరోనా వైరస్ వల్ల ఆర్థిక వ్యవస్థకు ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించేందుకు చర్యలు చేపడతామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ప్రకటించారు. ఈ కారణంగానే సూచీలన్నీ అధిక లాభాలతో ట్రేడయ్యాయని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బుధవారం మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 428.62 పాయింట్లు లాభపడి 41,323 వద్ద ముగిసింది. నిఫ్టీ 137.80 పాయింట్లు నష్టపోయి 12,130 […]

Update: 2020-02-19 05:35 GMT

వరుసగా నాలుగు రోజులు నష్టాలను చూసిన మార్కెట్లు బుధవారం భారీ స్థాయిలో లాభాలతో క్లోజయ్యాయి. కరోనా వైరస్ వల్ల ఆర్థిక వ్యవస్థకు ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించేందుకు చర్యలు చేపడతామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ప్రకటించారు. ఈ కారణంగానే సూచీలన్నీ అధిక లాభాలతో ట్రేడయ్యాయని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

బుధవారం మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 428.62 పాయింట్లు లాభపడి 41,323 వద్ద ముగిసింది. నిఫ్టీ 137.80 పాయింట్లు నష్టపోయి 12,130 వద్ద క్లోజయింది. యూఎస్ డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 71.46 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌లో సగానికిపైగా సూచీలు లాభాలతోనే ట్రేడయ్యాయి. బజాజ్ ఫినాన్స్, హిందూస్తాన్ యూనిలివర్, రిలయన్స్ ఓఎన్‌జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, నెస్లె ఇండియా, ఎన్‌టీపీసీ 2 శాతానికి పైగా లాభపడ్డాయి. సన్‌ఫార్మా, భారతీ ఎయిర్‌టెల్, టీసీఎస్ సూచీలు నష్టాలతో ముగిశాయి.

Tags:    

Similar News