భారీగా నష్టపోయిన మార్కెట్లు!

దిశ, సెంట్రల్ డెస్క్: దేశీయ మార్కెట్లకు ప్యాకేజీ రుచించలేదు. ఆదివారం కేంద్ర ఆర్థిక మంత్రి ప్యాకేజీ ఆఖరి విడత ప్రకటన ముగిసిన తర్వాత సోమవారం మార్కెట్లు ప్రారంభమేసమయానికి వెయ్యి పాయింట్ల నష్టాలను చూశాయి. నిఫ్టీ ఏకంగా నెల రోజుల కనిష్ఠానికి చేరింది. ముఖ్యంగా ఫైనాన్స్, బ్యాంకింగ్, ఆటో రంగం షేర్లు అమ్మకాల ఒత్తిడితో భారీగా పతనమయ్యాయి. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 1068.75 పాయింట్లు కోల్పోయి 30,028 వద్ద, నిఫ్టీ 313.60 పాయింట్ల నష్టంతో 8,823 వద్ద […]

Update: 2020-05-18 05:48 GMT

దిశ, సెంట్రల్ డెస్క్: దేశీయ మార్కెట్లకు ప్యాకేజీ రుచించలేదు. ఆదివారం కేంద్ర ఆర్థిక మంత్రి ప్యాకేజీ ఆఖరి విడత ప్రకటన ముగిసిన తర్వాత సోమవారం మార్కెట్లు ప్రారంభమేసమయానికి వెయ్యి పాయింట్ల నష్టాలను చూశాయి. నిఫ్టీ ఏకంగా నెల రోజుల కనిష్ఠానికి చేరింది. ముఖ్యంగా ఫైనాన్స్, బ్యాంకింగ్, ఆటో రంగం షేర్లు అమ్మకాల ఒత్తిడితో భారీగా పతనమయ్యాయి. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 1068.75 పాయింట్లు కోల్పోయి 30,028 వద్ద, నిఫ్టీ 313.60 పాయింట్ల నష్టంతో 8,823 వద్ద ముగిసింది. కొద్ది రోజులుగా స్థిరంగా కొనసాగుతున్న మార్కెట్లలో సెన్సెక్స్ 30,200 స్థాయిని కోల్పోగా, నిఫ్టీ 9000 స్థాయికి దిగువన పడిపోయింది. సెన్సెక్స్‌లో బ్యాంకింగ్‌, ఆటో, రియల్టీ, మెటల్‌, మీడియా రంగాలు 7-5 శాతం నుంచి 5.5 శాతం మధ్య పతనం అవగా.. ఐటీ మాత్రం స్వల్పంగా 1 శాతం పుంజుకుంది. నిఫ్టీ మేజర్ సూచీలు ఇండస్‌ఇండ్‌, అల్ట్రాటెక్‌, యాక్సిస్‌, బజాజ్‌ ఆటో, ఐషర్‌, మారుతీ, హెచ్‌డీఎఫ్‌సీ, బీపీసీఎల్‌, ఐసీఐసీఐ 10 శాతం నుంచి 7 శాతం మధ్య దిగజారాయి. సిప్లా, ఇన్‌ఫ్రాటెల్‌, టీసీఎస్‌, ఇన్‌ఫ్రాటెల్‌, ఇన్ఫోసిస్‌ 5.5శాతం నుంచి 1.2 శాతం మధ్య ఎగిశాయి.

అమలు ముఖ్యం…
కరోనా సంక్షోభాన్ని గట్టెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ. 20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీపై అసంతృప్తితో పాటు, లాక్‌డౌన్‌ను మే 31 వరకు పొడిగించడం, అమెరికా చైనా దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలహీనపరుస్తున్నట్టు మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. లాక్‌డౌన్ పొడిగింపు కారణంగా ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి మరింత సమయం పడుతుందనే నిరాశ ఉందని, ప్రభుత్వం ప్రకటించిన చర్యలు అమలులో ఎలా ఉండబోతున్నాయనే సందేహాలున్నాయని అరిహంట్ క్యాపిటల్ డైరెక్టర్ చెప్పారు.

ఎన్‌పీఏల గురించే ఆందోళన…
ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ సంతృప్తికరంగా లేకపోవడం, అంటువ్యాధి కొనసాగుతుండటంతో, మార్కెట్లు సుమారు 3.4 శాతం తగ్గాయి. ప్రభుత్వం తీసుకున్న చర్యలు దీర్ఘకాలంలో సానుకూలంగా మారవచ్చు. ఈ చర్యల తక్షణ ప్రభావం గురించి మార్కెట్లు ఆందోళన చెందుతున్నాయి. పెరుగుతున్న ఎన్‌పీఏల గురించి ఆందోళన వల్ల ఆర్థిక పరిస్థితులు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. మార్కెట్ పనితీరుపై అనిశ్చితి కొనసాగుతుందని జియోజిత్ ఫైనాన్సియల్ సర్విసెస్‌కు చెందిన వినోద్ నాయర్ చెప్పారు.

Tags:    

Similar News