NIA అలర్ట్.. రైతుల ముసుగులో ఉగ్రవాదులు!

దిశ, వెబ్‌డెస్క్ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. రైతులకు న్యాయం చేయాలని కోరుతూ భారత్‌తో పాటు కెనడా, అమెరికా, బ్రిటన్ దేశాలకు చెందిన రైతులు, రాజకీయ నేతలు తమ నిరసనను తెలుపుతున్నారు.అయితే, ఈ నిరసనల ముసుగులో భారత్ వ్యతిరేక విద్రోహ కార్యకలాపాలు జరిగినట్లు తెలుస్తోంది. ఇటీవల మనదేశానికి చెందిన రైతులకు మద్దతు పలుకుతూ లండన్ లోని భారత్ హై కమిషన్ కార్యాలయం ఎదుట నిరసనలు జరిగాయి.ఈ […]

Update: 2020-12-07 22:08 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. రైతులకు న్యాయం చేయాలని కోరుతూ భారత్‌తో పాటు కెనడా, అమెరికా, బ్రిటన్ దేశాలకు చెందిన రైతులు, రాజకీయ నేతలు తమ నిరసనను తెలుపుతున్నారు.అయితే, ఈ నిరసనల ముసుగులో భారత్ వ్యతిరేక విద్రోహ కార్యకలాపాలు జరిగినట్లు తెలుస్తోంది.

ఇటీవల మనదేశానికి చెందిన రైతులకు మద్దతు పలుకుతూ లండన్ లోని భారత్ హై కమిషన్ కార్యాలయం ఎదుట నిరసనలు జరిగాయి.ఈ నిరసనల్లో భారత్‌తో పాటు, రైతులకు వ్యతిరేకంగా నినాదాలు చేసినట్లు కొన్ని ఆధారాలు లభించాయి.

జాతీయ మీడియా కథనం ప్రకారం..నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ(ఎన్‌ఐఏ) లిస్ట్‌లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌గా ఉన్న ఖలిస్తాన్‌కు చెందిన ఉగ్రవాది పరమ్‌జీత్ సింగ్ పమ్మా భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసిన కొన్ని ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టెర్రరిస్ట్ పరమ్ జీత్ పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐ సానుభూతి పరుడని సమాచారం. కాగా, ఇవాళ జరిగే భారత్ బంద్‌లో దేశ వ్యతిరేక కార్యకలాపాలు చోటుచేసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం అందడంతో ఇంటెలిజెన్స్ అధికారులు అప్రమత్తమయ్యారు.

Tags:    

Similar News