ప్రేమ విఫలం.. న్యూస్ ఛానెల్ ఉద్యోగిని సూసైడ్

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో ఓ న్యూస్ ఛానల్ ఉద్యోగిని కల్యాణి (26) ఆత్మహత్య చేసుకుంది. రెండేళ్లుగా అదే సంస్థలో పనిచేస్తున్న శివ అనే యువకుడితో ప్రేమలో ఉన్న కల్యాణి, అతడు పెళ్లికి నిరాకరించడంతో తీవ్ర మనస్థాపానికి గురై మంగళవారం సూసైడ్ చేసుకుంది. గాంధీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. తన సోదరుడితో కలిసి ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న యువతి… సోదరుడు బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయింది. సోదరుడు బయట పని […]

Update: 2020-07-15 07:48 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో ఓ న్యూస్ ఛానల్ ఉద్యోగిని కల్యాణి (26) ఆత్మహత్య చేసుకుంది. రెండేళ్లుగా అదే సంస్థలో పనిచేస్తున్న శివ అనే యువకుడితో ప్రేమలో ఉన్న కల్యాణి, అతడు పెళ్లికి నిరాకరించడంతో తీవ్ర మనస్థాపానికి గురై మంగళవారం సూసైడ్ చేసుకుంది. గాంధీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.

తన సోదరుడితో కలిసి ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న యువతి… సోదరుడు బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయింది. సోదరుడు బయట పని ముగించుకొని ఇంటికి వెళ్లేసరికి కల్యాణి మృతదేహం ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. తన కుమార్తె మృతికి శివ అనే యువకుడే కారణమని తండ్రి ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..