ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు, మరణాలు

దిశ, ఏపీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. గత 24 గంటల వ్యవధిలో 90,574 నమూనాలను పరీక్షించగా 3,841 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 18,93,354కి చేరింది. ఇకపోతే నిన్నఒక్కరోజే రాష్ట్రంలో కరోనా వల్ల 38 మంది మరణించినట్లు ఏపీ వైద్యఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 12,744కి చేరింది. ఇకపోతే గడచిన […]

Update: 2021-07-01 08:48 GMT
AP corona Update
  • whatsapp icon

దిశ, ఏపీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. గత 24 గంటల వ్యవధిలో 90,574 నమూనాలను పరీక్షించగా 3,841 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 18,93,354కి చేరింది. ఇకపోతే నిన్నఒక్కరోజే రాష్ట్రంలో కరోనా వల్ల 38 మంది మరణించినట్లు ఏపీ వైద్యఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.

దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 12,744కి చేరింది. ఇకపోతే గడచిన 24 గంటల్లో 3,963 కరోనా నుంచి కోలుకోగా మెుత్తం మహమ్మారి నుంచి రికవరీ అయిన వారి సంఖ్య 18,42,432కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 38,178 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,20, 84,192 శాంపిల్స్‌ని పరీక్షించడం జరిగింది.

Tags:    

Similar News