ఈసారి న్యూ ఇయర్ వేడుకలు బంద్

బెంగళూరు: కరోనా వ్యాప్తి జరిగే ప్రమాదముందని కర్ణాటక ప్రభుత్వం పబ్, క్లబ్, రెస్టారెంట్లలో నూతన సంవత్సర వేడుకలను నిషేధించింది. డిసెంబర్ 30 నుంచి జనవరి 2వ తేదీ వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని ప్రభుత్వ ఆదేశాలు పేర్కొన్నాయి. సెలెబ్రేషన్స్, పార్టీల నిర్వహణపై మాత్రమే నిషేధముంటుందని, రోజువారీగా సాగే కార్యకలాపాలకు యథావిధిగా కొనసాగించుకోవచ్చునని స్పష్టం చేశాయి. క్లబ్‌లు, పబ్‌లు పార్టీలను నిర్వహించకూడదని, కానీ, కరోనా మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్ణీత మొత్తంలో డైనింగ్‌కు అనుమతి ఎప్పట్లాగే కొనసాగుతుందని వివరించాయి. […]

Update: 2020-12-20 09:59 GMT

బెంగళూరు: కరోనా వ్యాప్తి జరిగే ప్రమాదముందని కర్ణాటక ప్రభుత్వం పబ్, క్లబ్, రెస్టారెంట్లలో నూతన సంవత్సర వేడుకలను నిషేధించింది. డిసెంబర్ 30 నుంచి జనవరి 2వ తేదీ వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని ప్రభుత్వ ఆదేశాలు పేర్కొన్నాయి. సెలెబ్రేషన్స్, పార్టీల నిర్వహణపై మాత్రమే నిషేధముంటుందని, రోజువారీగా సాగే కార్యకలాపాలకు యథావిధిగా కొనసాగించుకోవచ్చునని స్పష్టం చేశాయి.

క్లబ్‌లు, పబ్‌లు పార్టీలను నిర్వహించకూడదని, కానీ, కరోనా మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్ణీత మొత్తంలో డైనింగ్‌కు అనుమతి ఎప్పట్లాగే కొనసాగుతుందని వివరించాయి. బెంగళూరులో నూతన సంవత్సర వేడుకల కోసం భారీగా జనాలు గుమిగూడతారని, కరోనా నేపథ్యంలో వాటిని నివారించాలనే ఉద్దేశంతోనే ఈ ఆదేశాలు వెలువరించినట్టు కర్ణాటక ఆరోగ్య మంత్రి డాక్టర్ కే సుధాకర్ తెలిపారు.

Tags:    

Similar News