పోలీసులకు ఆమె సహకరించడం లేదట..!

దిశ, వెబ్‌డెస్క్ : జొమాటో డెలివరీ బాయ్ కేసులో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులో ప్రత్యేక్ష సాక్షులు లేకపోవడం, దర్యాప్తునకు యువతి సహకరించక పోవడంతో పోలీసులు ఈ కేసును తాత్కాలికంగా నిలిపివేశారు. ఫుడ్ డెలివరీ ఆలస్యం అయిందని ప్రశ్నించినందుకు జొమాటో డెలివరీ బాయ్ తనపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడని బెంగళూరుకు చెందిన హితేష చంద్రాణి అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాను ఆమెపై దాడి చేయలేదని, ఆమే […]

Update: 2021-03-23 10:15 GMT

దిశ, వెబ్‌డెస్క్ : జొమాటో డెలివరీ బాయ్ కేసులో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులో ప్రత్యేక్ష సాక్షులు లేకపోవడం, దర్యాప్తునకు యువతి సహకరించక పోవడంతో పోలీసులు ఈ కేసును తాత్కాలికంగా నిలిపివేశారు.

ఫుడ్ డెలివరీ ఆలస్యం అయిందని ప్రశ్నించినందుకు జొమాటో డెలివరీ బాయ్ తనపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడని బెంగళూరుకు చెందిన హితేష చంద్రాణి అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాను ఆమెపై దాడి చేయలేదని, ఆమే చెప్పుతో తనపై దాడి చేసిందని జొమాటో డెలివరీ బాయ్ రివర్స్ కేసు పెట్టాడు. ఇద్దరి వాంగ్మూలం తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఘటన స్థలంలో సీసీ కెమెరాలు లేకపోవడం, ప్రత్యేక్ష సాక్షులు లేకపోవడంతో ఇన్వెస్టిగేషన్ క్లిష్టంగా మారింది.

మరోవైపు కేసు విచారణకు రావాలని హితేష చంద్రాణికి పోలీసులు ఫోన్ చేయగా.. తాను మా ఆంటీని చూడడానికి మహారాష్ట్ర వెళ్తున్నానని చెప్పిందని విచారణ అధికారి చెప్పారు. ఆమె బంధువులు మాత్రం హితేషకు ఆరోగ్యం బాగలేక ఆస్పత్రిలో చికిత్స పొందుతుందని పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని పేర్కొన్నారు. ఆమెకు ఎలా గాయాలు అయ్యాయో నివేదిక వచ్చిన తర్వాత.. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి హితేష ఆచూకీ తెలుసుకుంటామని పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News