మాషప్ మేనియా..
దిశ, వెబ్‌డెస్క్: పాత పాటలకు కొత్త బాణీలను జోడించి రీమిక్స్‌లు సృష్టిస్తారు. అదే రీమిక్స్‌ను రెండు మూడు పాటలకు చేస్తే మాషప్ అంటారు. ఈ పేరు వినడానికి చాలా సింపుల్‌గా అనిపించినా ఒక మాషప్ క్రియేట్ చేయడం చాలా కష్టం. ఒక్కసారి మాషప్ క్రియేట్ చేసి, విడుదల చేసిన తర్వాత వచ్చే స్పందన ఆ కష్టాన్ని మొత్తం మర్చిపోయేలా ఉంటుంది. తెలుగులో కూడా ఈ మాషప్ పాటలు ఇప్పుడు ట్రెండీగా నిలుస్తున్నాయి. ప్రతి హీరో పుట్టినరోజుకి ఆ […]
దిశ, వెబ్‌డెస్క్: పాత పాటలకు కొత్త బాణీలను జోడించి రీమిక్స్‌లు సృష్టిస్తారు. అదే రీమిక్స్‌ను రెండు మూడు పాటలకు చేస్తే మాషప్ అంటారు. ఈ పేరు వినడానికి చాలా సింపుల్‌గా అనిపించినా ఒక మాషప్ క్రియేట్ చేయడం చాలా కష్టం. ఒక్కసారి మాషప్ క్రియేట్ చేసి, విడుదల చేసిన తర్వాత వచ్చే స్పందన ఆ కష్టాన్ని మొత్తం మర్చిపోయేలా ఉంటుంది. తెలుగులో కూడా ఈ మాషప్ పాటలు ఇప్పుడు ట్రెండీగా నిలుస్తున్నాయి. ప్రతి హీరో పుట్టినరోజుకి ఆ హీరో పాటలను, బాగా హిట్ అయిన పాటలను ఒకే బీట్‌లో పాడుతూ మాషప్‌లు విడుదల చేస్తున్నారు. దీంతో బడ్డీ సింగర్‌లకు అవకాశాలు పెంచుకునే దారి దొరికింది. ఎలాగూ లాక్‌డౌన్ సమయంలో మంచి మంచి పాటలన్నీ సేకరించి వాటికి కొత్త బాణీ జోడించి ఇప్పుడు విడుదల చేసి, క్యాష్ చేసుకుంటున్న వర్థమాన గాయనీగాయకులు ఎంతో మంది ఉన్నారు.
ఎలా పాపులర్ అయింది?
మాషప్ పాటలు ఇష్టపడే వారికి ‘విద్యా వోక్స్’ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పాశ్చాత్య సంగీతాన్ని, భారతీయ సంగీతాన్ని కలుపుతూ ఒక సెపరేటు వీడియోగా చేసి ఆమె యూట్యూబ్‌లో విడుదల చేసేవారు. ఆ ఫ్యూజన్ మాషప్ పాటలు భారతీయ గాయనీ గాయకులకు ఒక స్ఫూర్తిని ఇచ్చాయి. దీంతో తాము కూడా ఎందుకు ప్రయత్నించకూడదని వర్థమాన గాయనీగాయకులు అనుకున్నారు. వారిలో ముఖ్యంగా ‘సందీప్ సన్ను, సత్య కుందేమ్, లలితా పేరి, మంజుషా సులోచన’లు మాషప్ పాటలకు తెలుగులో కొత్త ట్రెండ్‌ను తీసుకొచ్చారు. ‘ఎస్3ఐ’ మెమొరీస్ పేరుతో ఒక యూట్యూబ్ చానల్ స్టార్ట్ చేసి, ఒక బ్యాండ్‌గా మారి పాటలను మాషప్ చేస్తున్నారు. వీరికి ఫాలోయింగ్ తక్కువగానే ఉండొచ్చు కానీ ఉన్న కొందరు ఫాలోవర్లు అయినా జెన్యూన్‌గా ఉంటారు.
పేరున్న గాయకులు కూడా!
మాషప్ పాటలకు తెలుగులో అసలైన క్రేజ్ తీసుకొచ్చిన గాయనీగా మనీషా ఈరబత్తిని పేరు చెప్పుకోవచ్చు. ‘క్రేజీ ఫీలింగ్’ పేరుతో 2016లో టాలీవుడ్ మాషప్‌ను ఈమె విడుదల చేసింది. ఆ వీడియోకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. అదే ఊపుతో 2017లో కూడా ‘అరరే పేరు’తో మరో మాషప్ తీసుకొచ్చింది. తర్వాత వరుసగా హిందీ, తెలుగు పాటలను కలిపి కూడా ఆమె మాషప్ చేసింది. ఇప్పుడు ప్రాచుర్యం పొందిన పాటలకు కొద్దిగా మాషప్ జోడించి కవర్ వెర్షన్‌లను ఆమె విడుదల చేస్తున్నారు. ఇక మాషప్‌లకు మరింత ప్రాచుర్యాన్ని కలిపిస్తున్న మరో పాపులర్ సింగర్ లిప్సిక. మూడేళ్ల క్రితం ‘హమ్మ మాషప్’ కవర్‌తో మొదలుపెట్టి తర్వాత ఇంగ్లీష్ పాట ‘క్లోజర్’కు తెలుగు మాషప్ చేసింది. ఆ తర్వాత ‘గాలే, అటెన్షన్, వెన్నెల వెన్నెలా, సెన్యోరీటా, చిన్మయి లవ్ మాషప్, స్పీచ్‌లెస్’ పేర్లతో మాషప్ పాటలను విడుదల చేసింది.
యూట్యూబర్‌లుగా సింగర్స్..
తమ టాలెంట్‌ను నిరూపించుకోవడానికి సినిమాలే అక్కర్లేదని నిర్ణయించుకున్న గాయనీగాయకులు అందరూ యూబ్యూబ్‌లో మాషప్ పాటలు, కవర్ వెర్షన్‌లు పెడుతూ పాపులర్ అవుతున్నారు. ఒక భాషకే పరిమితం కాకుండా విభిన్న భాషల్లోని పాటలు కలుపుతూ మాషప్ చేసి, కొత్త బాణీలు సృష్టిస్తున్నారు. డిజిటల్ వాద్యాన్ని లూప్‌లో ప్లే చేసి ఒకే బాణీలో విభిన్న పాటలు పాడుతూ ఆకట్టుకుంటున్నారు. ‘గెట్ నిత్యఫైడ్’ పేరుతో సింగర్ నిత్యశ్రీ నడుపుతున్న యూట్యూబ్ చానల్‌లో ఇలాంటి పాటల వీడియోలే ఉంటాయి. ఇంకా ‘జాషువా ఆరన్, సన్నీ ఆస్టిన్’ వంటి వర్థమాన సంగీత దర్శకులు కూడా ఇలా మాషప్‌లు, ర్యాప్‌ల మీదనే దృష్టిసారించి మ్యూజిక్‌ను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు.