ఇది కూడా కరోనా లక్షణమే!

దిశ, వెబ్‌డెస్క్: వాషింగ్టన్‌లోని కిర్క్‌లాండ్‌ హాస్పిటల్‌లో కరోనా వ్యాధిగ్రస్తులకు చికిత్స చేస్తున్న ఓ నర్సు పేషెంట్లు అందరిలో కనిపిస్తున్న కొత్త లక్షణం గురించి బయటపెట్టారు. కరోనా లక్షణాలను వివరించేటపుడు ఎవరూ ఈ లక్షణాన్ని గమనించట్లేదని నర్సు చెల్సీ ఎర్నెస్ట్ అన్నారు. తాను ట్రీట్ చేసిన అందరు కరోనా పేషెంట్లలో కళ్లు చుట్టూ ఎర్రటి ఛాయలు ఏర్పడ్డాయని చెప్పారు. కరోనాలో సాధారణంగా కనిపించే జలుబు, గొంతునొప్పి కంటే ముందు వారి కళ్లు ఎర్రబడుతున్నాయని చెల్సీ బయటపెట్టారు. కళ్లు ఎర్రబడటం […]

Update: 2020-03-27 01:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: వాషింగ్టన్‌లోని కిర్క్‌లాండ్‌ హాస్పిటల్‌లో కరోనా వ్యాధిగ్రస్తులకు చికిత్స చేస్తున్న ఓ నర్సు పేషెంట్లు అందరిలో కనిపిస్తున్న కొత్త లక్షణం గురించి బయటపెట్టారు. కరోనా లక్షణాలను వివరించేటపుడు ఎవరూ ఈ లక్షణాన్ని గమనించట్లేదని నర్సు చెల్సీ ఎర్నెస్ట్ అన్నారు. తాను ట్రీట్ చేసిన అందరు కరోనా పేషెంట్లలో కళ్లు చుట్టూ ఎర్రటి ఛాయలు ఏర్పడ్డాయని చెప్పారు. కరోనాలో సాధారణంగా కనిపించే జలుబు, గొంతునొప్పి కంటే ముందు వారి కళ్లు ఎర్రబడుతున్నాయని చెల్సీ బయటపెట్టారు. కళ్లు ఎర్రబడటం అంటే లోపల తెల్లగుడ్డు ఎరుపు రంగులోకి మారకుండా కంటి బయట చర్మం దాదాపు ఎరుపు రంగులో మారుతుందని చెప్పారు. తాను పనిచేస్తున్న లైఫ్ కేర్ సెంటర్‌లో దాదాపు 37 మంది కరోనా బాధితుల చావును ఆమె దగ్గరుండి చూశారు. గొంతునొప్పి, శ్వాసలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపించకుండా కేవలం కళ్లలో ఎలర్జీ వచ్చి రెండ్రోజుల్లో చనిపోయిన పేషెంట్లను కూడా తాను చూసినట్లు చెల్సీ వివరించారు. ఆమె చెప్పిన దాని ప్రకారం చూస్తే కరోనా వైరస్ పేషెంటు నుంచి పేషెంటుకు మ్యూటేషన్ చెందుతోందనే దిశలో పరిశోధకులు ప్రయోగం మొదలుపెట్టారు.

Tags: Corona, Patient, Red Eyes, allergy, Zombie eyes, COVID 19

Tags:    

Similar News