ఈఎస్ఐ స్కామ్‎లో రోజుకో కొత్త కోణం..!

దిశ, వెబ్‎డెస్క్: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ స్కామ్‎లో ప్రధాన నిందితురాలైన దేవికారాణి అవినీతి లీలలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. తాజాగా ఏసీబీ అధికారులు నిర్వహించిన సోదాల్లో రూ.2.47 కోట్లు బయటపడ్డాయి. ఇందులో దేవికారాణివి రూ.1.29 కోట్లు కాగా.. ఆమె బినామీల నుంచి రూ.65 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఫార్మాసిస్ట్ నాగలక్ష్మీ దగ్గర రూ.35 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో దేవికారాణిపై మరో కేసు నమోదు చేశారు ఏసీబీ అధికారులు. సైబరాబాద్‎లో కమర్షియల్ ప్రాపర్టీ […]

Update: 2020-09-11 11:16 GMT

దిశ, వెబ్‎డెస్క్:

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ స్కామ్‎లో ప్రధాన నిందితురాలైన దేవికారాణి అవినీతి లీలలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. తాజాగా ఏసీబీ అధికారులు నిర్వహించిన సోదాల్లో రూ.2.47 కోట్లు బయటపడ్డాయి. ఇందులో దేవికారాణివి రూ.1.29 కోట్లు కాగా.. ఆమె బినామీల నుంచి రూ.65 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఫార్మాసిస్ట్ నాగలక్ష్మీ దగ్గర రూ.35 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

ఈ నేపథ్యంలో దేవికారాణిపై మరో కేసు నమోదు చేశారు ఏసీబీ అధికారులు. సైబరాబాద్‎లో కమర్షియల్ ప్రాపర్టీ కొనుగోలు చేసేందుకు యత్నించినట్లు ఏసీబీ అధికారులు సేకరించారు. ఈ సోదాల్లో స్వాధీనం చేసుకున్న డబ్బును సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.

Tags:    

Similar News