కమ్యూనిస్టుల ఇలాకాలో కొత్త జాతి మలేరియా?
దిశ, వెబ్‌డెస్క్ : కమ్యూనిస్టు పాలనలో ఉన్న కేరళ రాష్ట్రంలో కొత్త జాతి మలేరియాను గుర్తించారు. సూడాన్ నుంచి వచ్చిన ఓ సైనికుడి శరీరంలో కొత్త మలేరియాను గుర్తించినట్లు వైద్యులు తెలిపారు. దానిని ప్లాస్మోడియం ఓవల్ అనే మలేరియా పరాన్నజీవిగా పిలుస్తున్నారు. కన్నూర్ జిల్లాలోని ఓ ఆస్పత్రిలో ఆ సైనికుడికి ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. సకాలంలో చికిత్స, నియంత్రణతో వ్యాధిని అరికట్టొచ్చన్న ప్రభుత్వం భావిస్తోంది. అయితే, కొత్త మలేరియా గురించి ప్రభుత్వం ప్రకటన చేయడంతో కేరళ వాసులు […]
దిశ, వెబ్‌డెస్క్ : కమ్యూనిస్టు పాలనలో ఉన్న కేరళ రాష్ట్రంలో కొత్త జాతి మలేరియాను గుర్తించారు. సూడాన్ నుంచి వచ్చిన ఓ సైనికుడి శరీరంలో కొత్త మలేరియాను గుర్తించినట్లు వైద్యులు తెలిపారు. దానిని ప్లాస్మోడియం ఓవల్ అనే మలేరియా పరాన్నజీవిగా పిలుస్తున్నారు. కన్నూర్ జిల్లాలోని ఓ ఆస్పత్రిలో ఆ సైనికుడికి ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. సకాలంలో చికిత్స, నియంత్రణతో వ్యాధిని అరికట్టొచ్చన్న ప్రభుత్వం భావిస్తోంది.
అయితే, కొత్త మలేరియా గురించి ప్రభుత్వం ప్రకటన చేయడంతో కేరళ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే, దేశంలో కరోనా మహమ్మారి తొలుత కేరళలోనే వెలుగు చూసింది. విదేశాల నుంచి వారిలో కరోనా లక్షణాలు కనిపించడంతో వారిని క్వారంటైన్ చేసి చికిత్స అందించారు. ఆ తర్వాత, అనతి కాలంలో చాలా మంది కేరళ ప్రజలు కరోనా బారిన పడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.