కేసీఆర్‌ను బయటకు రప్పించింది రేవంతే..!
దిశ, తెలంగాణ బ్యూరో : రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కావడంతో కేడర్‌లో కొత్త జోష్ వచ్చిందని టీపీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్ అన్నారు. సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచి కష్టపడి పనిచేసే వ్యక్తి రేవంత్ అని చెప్పారు. రాష్ట్రంలో మళ్లీ మర్రి చెన్నారెడ్డి, వైఎస్‌ఆర్ నాటి పరిస్థితులు తిరిగి రానున్నాయన్నారు. ఎన్నడూ ఫాం హౌజ్ నుంచి బయటికు రాని కేసీఆర్ ఇప్పుడు వచ్చి ప్రజలకు కనబడుతున్నాడని, దానికి […]
దిశ, తెలంగాణ బ్యూరో : రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కావడంతో కేడర్‌లో కొత్త జోష్ వచ్చిందని టీపీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్ అన్నారు. సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచి కష్టపడి పనిచేసే వ్యక్తి రేవంత్ అని చెప్పారు. రాష్ట్రంలో మళ్లీ మర్రి చెన్నారెడ్డి, వైఎస్‌ఆర్ నాటి పరిస్థితులు తిరిగి రానున్నాయన్నారు. ఎన్నడూ ఫాం హౌజ్ నుంచి బయటికు రాని కేసీఆర్ ఇప్పుడు వచ్చి ప్రజలకు కనబడుతున్నాడని, దానికి కారణం రేవంత్ అన్నారు.
ఏనాడు పాదయాత్రల గురించి మాట్లాడని బీజేపీ ఇప్పుడు పాదయాత్ర గురించి మాట్లాడుతుంటే.. ఎంత అభద్రత ఉందో అర్థం అవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేసి గెలవాలని సవాల్ విసిరారు. తాను కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్న ఎన్ఎస్ఐలో పని చేశానని, ఆ తరువాత పార్టీలో వివిధ స్థాయిల్లో పనిచేస్తూ వస్తున్నట్లు పేర్కొన్నారు. పార్టీ ఆదేశించిన అన్ని కార్యక్రమాలను విజయవంతం పూర్తి చేశానని, గతంలో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా అవకాశం ఇచ్చినప్పుడు కూడా సమర్థవంతంగా పనిచేసినట్లు వివరించారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మళ్లీ పనిచేయడం ఇష్టం లేదని పార్టీ అధినేత సోనియా గాంధీకి లేఖ రాశానని, దానిని స్పందించి ప్రస్తుత కమిటీలో చోటు కల్పించలేదని తెలిపారు.