టాప్‌లెస్‌గా ఓటేసిన మహిళ
దిశ, వెబ్‌డెస్క్ : అమెరికా, న్యూ హాంప్‌షైర్‌లోని ఎక్సెటర్‌లో ఇటీవలే పోలింగ్ జరిగింది. ఈ క్రమంలో ఓ మహిళ తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు అక్కడికొచ్చింది. పోలింగ్ కేంద్రంలోని బాలెట్ క్లర్క్.. సదరు మహిళను చెక్ చేశాడు. ఆ తర్వాత అధికారులు.. ఆమె ఓటు వేసేందుకు అడ్డు చెప్పారు. ఇంతలో ఆమె తన టీషర్ట్ విప్పేసి.. ఓటు వేసి.. అక్కడి నుంచి వెళ్లిపోయింది. అసలు అక్కడేం జరిగింది? టాప్‌లెస్‌గా ఓటు వేయడానికి అధికారులు ఎలా అనుమతి ఇచ్చారు? […]
దిశ, వెబ్‌డెస్క్ : అమెరికా, న్యూ హాంప్‌షైర్‌లోని ఎక్సెటర్‌లో ఇటీవలే పోలింగ్ జరిగింది. ఈ క్రమంలో ఓ మహిళ తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు అక్కడికొచ్చింది. పోలింగ్ కేంద్రంలోని బాలెట్ క్లర్క్.. సదరు మహిళను చెక్ చేశాడు. ఆ తర్వాత అధికారులు.. ఆమె ఓటు వేసేందుకు అడ్డు చెప్పారు. ఇంతలో ఆమె తన టీషర్ట్ విప్పేసి.. ఓటు వేసి.. అక్కడి నుంచి వెళ్లిపోయింది. అసలు అక్కడేం జరిగింది? టాప్‌లెస్‌గా ఓటు వేయడానికి అధికారులు ఎలా అనుమతి ఇచ్చారు?
ఓటు వేసేందుకు పోలింగ్ బూత్‌కు వచ్చిన ఎక్సెటర్‌కు చెందిన మహిళ టీషర్ట్‌పై ‘మెక్‌కైన్ హీరో.. ట్రంప్ జీరో’ అనే నినాదం రాసి ఉంది. ఎన్నికల రూల్స్ ప్రకారం పోలింగ్ కేంద్రానికి కిలోమీటర్ దూరంలో గానీ, పోలింగ్ కేంద్రంలో గానీ.. రాజకీయ పార్టీలు, నేతలు లేదా రాజకీయ నినాదాలతో ఉండే దుస్తులు, వస్తువులను ధరించడం, ప్రదర్శించడం నిషేధం. అలా చేస్తే వెయ్యి డాలర్లు (రూ.73,457) జరిమానా విధిస్తారు. సదరు మహిళ టీషర్టుపై ఓ పార్టీకి చెందిన నినాదం ఉండటంతో అధికారులు ఆమెను పోలింగ్ బూత్‌లోకి అనుమతించలేదు. అప్పటికీ ఆ నినాదాన్ని కవర్ చేసుకుని ఓటు వేసేందుకు వెళ్లాలని తేల్చి చెప్పారు. అయితే, అవేమీ పట్టించుకోకుండా.. ‘నా టీషర్టును విప్పేస్తే మీకేమైనా అభ్యంతరమా’ అని ప్రశ్నించింది. అధికారులు సమాధానం చెప్పేలోపే టాప్ తీసేసి అధికారికి ఇచ్చేసి ఓటేయడానికి వెళ్లింది.
ఓటేసిన తర్వాత మళ్లీ తన టీషర్టును ధరించి వెళ్లిపోయింది. టౌన్ మోడరేటర్ పౌల్ స్కాఫిదీ మాట్లాడుతూ.. ‘ఆమెకు సమాధానం చెప్పేలోపే టీషర్ట్ విప్పేసి ఓటేయడానికి వెళ్లిపోయింది. స్టేట్ ఇండెన్సీ లా (అసభ్య ప్రవర్తన చట్టం) కింద ఆమె పేరును పోలింగ్ ప్లేస్ నుంచి తొలగించామన్నారు. ఈ విషయాన్ని తాము పెద్దది చేయదలచుకోలేదని, దీని కంటే ముఖ్యమైన పనులు ఇంకా చాలానే ఉన్నాయన్నారు. ‘నా ఎక్స్ పీరియన్స్‌లో నేను ఇలాంటి సంఘటన ఎప్పుడూ చూడలేదు. అయితే, ఆమె పోలింగ్ బూత్ నుంచి వెళ్లిపోయాక అంతా సవ్యంగానే సాగిపోయింది. మొత్తంగా 2 వేల ఓట్లు పోలయ్యాయి’ అని స్కౌఫిదీ తెలిపారు.